Kadiyam Srihari - Kavya: బిఆర్ఎస్ కి షాక్ .. కాంగ్రెస్‌లో చేరనున్న కడియం శ్రీహరి, కడియం కావ్య
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి వరుసగా షాక్ మీద షాక్ లు తగులుతున్నాయి. ఇప్పటికే,ఎంపీ కే కేశవరావు,హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. తాజాగా,మరో బీఆర్ఎస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే కడియం శ్రీహరి,వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య ఆ పార్టీకి రాజీనామా చేశారు. తాను వరంగల్ బరి నుంచి తప్పుకుంటున్నట్లు బీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు రాసిన లేఖలో డాక్టర్ కావ్య పేర్కొంది. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ తరపున వరంగల్ నుంచి పోటీ చేసే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఇటీవల మీడియాలో వస్తున్న కథనాలు, అవినీతి, భూకబ్జాలు, ఫోన్ ట్యాపింగ్‌లు, మద్యం కుంభకోణాల ఆరోపణలు పార్టీ ప్రతిష్టను, విశ్వసనీయతను దిగజార్చాయన్నారు.
కాంగ్రెస్ అగ్రనేతల సమక్షంలో కడియం శ్రీహరి, కావ్య కాంగ్రెస్ పార్టీలోకి..
జిల్లాలో నేతల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల పార్టీకి నష్టం వాటిల్లుతోందన్నారు.ఈ నేపథ్యంలో,పోటీ నుండి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు కావ్య తెలిపారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్,కార్యకర్తలు తనను మన్నించాలని ఆ లేఖలో కావ్య పేర్కొన్నారు. కాగా,కడియం శ్రీహరితోపాటు కావ్య కూడా నేడు కాంగ్రెస్ పార్టీలోచేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ నుండి వరంగల్ ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్య బరిలో దిగనున్నారు.ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నేతలతో ఈ విషయమై కడియం శ్రీహరితో చర్చలు కూడా జరిపారు. ఈ క్రమంలోనే కడియం శ్రీహరి,కావ్య గురువారం గురువారం రాత్రి ఢిల్లీకి వెళ్లినట్లు తెలుస్తోంది. టీపీసీసీ చీఫ్,తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ అగ్రనేతల సమక్షంలో కడియం శ్రీహరి, కావ్య కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది.
టీడీపీలో సీనియర్ పదవుల్లో కడియం శ్రీహరి
కడియం శ్రీహరి చాలా కాలం పాటు టీడీపీలో ఉండి అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి వంటి సీనియర్ పదవుల్లో పనిచేశారు. ఆయన టీఆర్‌ఎస్‌లో చేరి 2014లో వరంగల్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. అయితే ఏడాదిన్నర తర్వాత ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేసి శాసనమండలికి ఎన్నికయ్యేలా చేసి ఉప ముఖ్యమంత్రిని చేశారు కేసీఆర్. శ్రీహరి నిష్క్రమణ, అతని కుమార్తె కావ్య పోటీ నుండి వైదొలగడం నిజంగా BRSని షాక్ అనే చెప్పాలి.