Kamal Haasan: త్రిభాషా విధానంపై కమల్ హాసన్ ఫైర్... డీఎంకే మద్దతుగా కీలక వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
తమిళనాడులో డీలిమిటేషన్, త్రిభాషా విధానంపై అధికార డీఎంకే, కేంద్రంలోని బీజేపీ మధ్య తీవ్ర వివాదం కొనసాగుతోంది.
ఈ నేపథ్యంలో మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత, ప్రముఖ నటుడు కమల్ హాసన్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇండియాను 'హిందీయా'గా మార్చే కుట్ర జరుగుతోందని కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
అన్ని రాష్ట్రాలు హిందీలో మాట్లాడేలా చేసి, ఎన్నికల్లో మెజార్టీ సాధించాలనే లక్ష్యంతో కేంద్రం పని చేస్తోందన్నారు.
మనం ఇండియా గురించి ఆలోచిస్తుంటే.. వారు మాత్రం 'హిందీయా' అని కలలుకంటున్నారని కమల్ హాసన్ విమర్శించారు.
డీలిమిటేషన్, భాషా విధానాలపై బుధవారం తమిళ పార్టీల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీలు ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పంపాయి.
Details
హిందీయా కాదు.. ఇండియా
కమల్ హాసన్ తన ప్రసంగంలో 2019లో స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు.
అప్పట్లో హిందీ దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా భారత్‌ను హిందీతో అనుసంధానం చేస్తూ ట్వీట్ చేశారు. దీనిపై స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ 'ఇది ఇండియా.. హిందీయా కాదని కౌంటర్ ఇచ్చారు.
కమల్ హాసన్ తన తాజా ప్రసంగంలో కూడా అదే విషయాన్ని ప్రస్తావిస్తూ, తమిళ ప్రజలు భాష కోసం పోరాడారని, ఇది ఆటలు ఆడే విషయం కాదని హెచ్చరించారు.
Details
త్రిభాషా విధానంపై డీఎంకే-కేంద్రం ఘర్షణ
కేంద్ర ప్రభుత్వం త్రిభాషా విధానాన్ని అమలు చేయాలని ఆదేశించింది. తమిళనాడు దీనిని తిరస్కరించడంతో, రాష్ట్రానికి రావాల్సిన నిధులను నిలిపివేస్తామంటూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ హెచ్చరించారు.
దీనిపై డీఎంకే తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.
విద్యను అడ్డుపెట్టుకుని కేంద్రం బ్లాక్‌మెయిల్ చేస్తోందని మండిపడింది. రాష్ట్రానికి రావాల్సిన వేల కోట్ల నిధులను నిలిపివేశారని ఆరోపించింది.