Delhi Election Results: దిల్లీలో కమలం జోరు.. మ్యాజిక్ ఫిగర్ దాటేసిన బీజేపీ
ఈ వార్తాకథనం ఏంటి
దిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. 11 జిల్లాల్లోని 19 కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తి కావస్తుండగా ఎర్లీ ట్రెండ్స్‌లో బీజేపీ మెజార్టీ మార్కును దాటింది.
తాజా ఫలితాల ప్రకారం బీజేపీ 42 స్థానాల్లో ముందంజ ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ 26 స్థానాలు, కాంగ్రెస్ 1 స్థానంలో మాత్రమే ఆధిక్యంలో ఉంది.
ముస్లిం ప్రభావిత నియోజకవర్గం ఓఖ్లాలో బీజేపీ 70 ఓట్ల ఆధిక్యంలో ఉంది. షకూర్ బస్తీలో ఆప్ అభ్యర్థి సత్యేంద్ర జైన్ ముందంజలో ఉండగా, ఓఖ్లాలో ఆప్ అభ్యర్థి అమానుతుల్లా ఖాన్ ఆధిక్యంలో ఉన్నాడు.
Details
గాంధీ నగర్ బీజేపీ అభ్యర్థి ఆధిక్యం
కార్యాన్ నగర్‌లో బీజేపీ అభ్యర్థి కపిల్ మిశ్రా లీడింగ్‌లో ఉండగా, బద్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి దేవేంద్ర యాదవ్ ముందంజలో ఉన్నాడు.
గాంధీనగర్‌లో బీజేపీ అభ్యర్థి అరవింద్ సింగ్ ఆధిక్యంలో ఉండగా బిజ్వాసన్ నియోజకవర్గంలో బీజేపీ తఅభ్యర్థి కైలాష్ ముందంజ ఉండడం గమనార్హం.