Page Loader
దిల్లీలో కాల్పుల కలకలం.. 12 కేసుల్లో నిందితుడు, కిరాయి హంతకుడు కమిల్ అరెస్ట్  
దిల్లీలో ఎన్‌కౌంటర్ తర్వాత వాంటెడ్ కాంట్రాక్ట్ కిల్లర్ అరెస్ట్

దిల్లీలో కాల్పుల కలకలం.. 12 కేసుల్లో నిందితుడు, కిరాయి హంతకుడు కమిల్ అరెస్ట్  

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jul 06, 2023
12:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశ రాజధాని దిల్లీలో కాల్పుల కలకలం రేగింది. నగరంలోని రోహిణిలో తెల్లవారుజామున ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ మేరకు కరుడుగట్టిన కిరాయి హంతకుడు కమిల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అనేక హత్య కేసుల్లో నేరస్థుడిగా ఉన్న కమిల్ కాల్పుల్లో గాయపడ్డాడు.తొలుత తమకు లొంగిపోవాలని పోలీసులు హెచ్చరించినప్పటికీ, కమిల్ పారిపోయేందుకు యత్నిస్తూ పోలీసులపైనే కాల్పులకు దిగాడు. దీంతో పోలీసులు భీకరమైన ప్రతి కాల్పులు చేయడంతో కమిల్ కాలికి బుల్లెట్ తగిలింది. ఈ క్రమంలోనే అతడిని అదుపులోకి తీసుకుని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అనంతరం కాంట్రాక్ట్ కిల్లర్ కమిల్ నుంచి నిషేధిత టర్కీ జిగానా పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నారు. గత ఏప్రిల్‌లో జరిగిన ఉత్తర్‌ప్రదేశ్ డాన్ అతిక్ అహ్మద్ హత్యకూ జిగానా పిస్టల్‌నే ఉపయోగించడం గమనార్హం.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

12 కేసుల్లో నిందితుడిగా ఉన్న కిరాయి హంతకుడు కమిల్ అరెస్ట్