
సంక్షోభంలో ఎన్సీపీ.. ఇవాళ దిల్లీలో అత్యవసర సమావేశానికి శరద్ పవార్ పిలుపు
ఈ వార్తాకథనం ఏంటి
మహారాష్ట్రకు చెందిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ పార్టీ గురువారం దిల్లీలో అత్యవసర జాతీయ కార్యవర్గ సమావేశానికి పిలుపునిచ్చింది.
ఈ మేరకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు శరద్ పవార్ నేతృత్వంలో సాగనున్న ఈ సమావేశానికి వివిధ రాష్ట్రాల నేతలు భేటీకి హాజరుకానున్నారు.
ఎన్సీపీ సీనియర్ నేత అజిత్ పవార్ తిరుగుబాటుతో పార్టీ 2 వర్గాలుగా చీలిపోయింది.ఈ నేపథ్యంలోనే నేతల మధ్య సయోధ్య కుదిర్చి పార్టీని ఐక్యంగా ఉంచేందుకు పవార్ చర్యలు చేపట్టారు.
జులై 2న ఎన్సీపీ చీలిక అనంతరం రెండు వర్గాలు బుధవారం వేర్వేరుగా సమావేశమయ్యాయి. ఈ క్రమంలోనే తమ బలాబలాలను చాటుకున్నాయి.
ఎన్సీపీకి మొత్తం 53 మంది ఎమ్మెల్యేలు ఉండగా, అజిత్ వర్గం ఏర్పాటు చేసిన సమావేశానికి 32 మంది హాజరయ్యారు.
DETAILS
శరద్ పవార్ కు తగిన సమాధానం ఇస్తా : అజిత్ పవార్
మరోవైపు పవార్ వర్గం సమావేశంలో 16 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలు, నలుగురు ఎంపీలు పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఎన్నికల గుర్తుపై ఇరు వర్గాలు ఎన్నికల కమిషన్‌కు పోటాపోటీగా ఫిర్యాదు చేశాయి.
తనకు 40 మందికిపైగా ఎమ్మెల్యేలు,ఎంపీల మద్ధతు ఉందని అజిత్ వర్గం ఈసీ దృష్టికి తీసుకెళ్లింది.ఈ మేరకు అఫిడవిట్లను సమర్పించింది.
దక్షిణ ముంబైలోని యశ్వంతరావ్ చవాన్ ప్రతిష్ఠాన్‌లో నిర్వహించిన భేటీలో పార్టీ అధినేత శరద్ పవార్ అజిత్ తీరుపై మండిపడ్డారు. ఓ వైపు తమ నేతలను విమర్శిస్తూనే మరోవైపు ప్రభుత్వంలో మంత్రులుగా ఎలా తీసుకున్నారని ప్రశ్నించారు.
పార్టీలో తాను ఎన్నో అవమానాల్ని ఎదుర్కొన్నానని, శరద్ పవార్ కు తగిన సమాధానం ఇస్తానని తిరుగుబాటు నేత అజిత్ పవార్ అన్నారు.