Karan Bhushan-Firing-Video: ఎంపీ అభ్యర్థి కరణ్ భూషణ్ కాన్వాయ్ వద్ద కాల్పులు...వీడియో వైరల్
ఈ వార్తాకథనం ఏంటి
ఉత్తర ప్రదేశ్ (Uttara Pradesh) కైసర్ గంజ్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ ఎంపీ అభ్యర్థి కరణ్ భూషణ్(Karana Bhushan)కాన్వాయ్ వద్ద కాల్పులు జరిగాయి.
దీనికి సంబంధించి వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
ఎంపీ బ్రిజ్ భూషణ్ చిన్న కుమారుడైన కరణ్ భూషణ్ శుక్రవారం పార్టీ తరఫున నామినేషన్ దాఖలు చేశారు.
శనివారం ఉదయం విష్ణుహర్ పూర్ నుంచి బయల్దేరిన కరణ్ భూషణ్ కాన్వాయ్ కు పలు ప్రాంతాల్లో ఘనంగా స్వాగతం లభించింది.
ఈ క్రమంలో తారాబా గంజ్ అసెంబ్లీ నియోజకవర్గంలోని బెల్సర్ మార్కెట్ ప్రాంతంలో కాన్వాయ్ బయల్దేరినప్పుడు బుల్లెట్ల శబ్దం వినిపించింది.
Karan Bhushan-Firing-Video
దర్యాప్తు చేస్తున్న పోలీసులు
ఒక్కసారిగా అక్కడ సందడి వాతావరణమంతా నిశ్శబ్దంగా మారిపోయింది.
ఈ దృశ్యాలను వీడియో తీసిన కొంతమంది సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
అయితే కాల్పుల్లో ఎవరికీ ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఈ కాల్పుల ఘటనను పోలీస్ అధికారులు సీరియస్ తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.