కర్ణాటకలో 136 సీట్లలో కాంగ్రెస్ విజయం; పదేళ్ల తర్వాత సొంతంగా అధికారంలోకి
ఈ వార్తాకథనం ఏంటి
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. 10 సంవత్సరాల తర్వాత కర్ణాటకలో హస్తం పార్టీ సొంతంగా అధికారంలోకి వచ్చింది.
136 సీట్లలో విజయం సాధించి, దక్షిణ భారతదేశంలో బీజేపీ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది.
2018లో గెలుపొందిన 104 సీట్లను గెల్చుకున్న బీజేపీ ఈ ఎన్నికల్లో 65 స్థానాలకు మాత్రమే పరిమితమైంది.
2023 ఎన్నికల్లో కూడా కింగ్ మేకర్ అవ్వాలని ఆశపడిన జేడీ(ఎస్) కేవలం 19 సీట్లను మాత్రమే గెల్చుకుంది. తద్వారా జేడీ(ఎస్) కింగ్ మేకర్ అవ్వాలన్న ఆశ అడియాశలయ్యాయి.
కాంగ్రెస్
38.04 శాతం నుంచి 42.94 శాతానికి పెరిగిన కాంగ్రెస్ ఓటు షేరు
2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓట్ల శాతం 36.22(2018లో) నుంచి 35.8 శాతానికి పడిపోయింది.
కాంగ్రెస్ ఓట్ల శాతం 38.04(2018లో) శాతం నుంచి 42.94 శాతానికి పెరిగింది.
1985 నుంచి అధికారంలో ఉన్న పార్టీ రెండోసారి పవర్‌లోకి రాలేదు. ఈ సారి కూడా కర్ణాటకలో పాత సంప్రదాయమే కొనసాగింది.
1989లో కాంగ్రెస్ 178 సీట్లు గెల్చుకుంది. అప్పటి నుంచి కాంగ్రెస్ అత్యుత్తమంగా సీట్లను గెల్చుకున్నది ఈ సారే కావడం గమనార్హం.
త్వరలో తెలంగాణ, మిజోరాం, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌తో పాటు ఈ ఏడాది మరో ఐదు రాష్ట్రాలలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కర్ణాటక ఫలితాలు కాంగ్రెస్‌కు పెద్ద బూస్టప్‌గా మారినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
కాంగ్రెస్
భారత్ జోడో యాత్ర సాగిన మార్గంలో 99% సీట్లు గెలిచాం: మల్లికార్జున్ ఖర్గే
కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంపై పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది కాంగ్రెస్‌కు పెద్ద విజయం అన్నారు.
దీని ద్వారా దేశం మొత్తంలో ఒక కొత్త శక్తి ఉద్భవించిందన్నారు. భారత్ జోడో యాత్ర కన్యా కుమారి నుంచి కాశ్మీర్ వరకు సాగిందని, కర్ణాటకలో రాహుల్ గాంధీ నడిచిన మార్గంలో దాదాపు 99 శాతం సీట్లు సాధించామన్నారు.
అందుకు ఆయనకు ధన్యవాదాలని మల్లికార్జున్ అన్నారు. ప్రజాస్వామ్య ప్రభుత్వం కావాలంటే ప్రజలు ఇలా ఐక్యంగా ఉండాలన్నారు. అప్పుడే యుద్ధంలో విజయం సాధించగలమని పేర్కొన్నారు.
Embed
సీఎం పదవికి రాజీనామా చేసిన బొమ్మై
#WATCH | Karnataka CM & BJP leader Basavaraj Bommai arrives at Raj Bhawan to tender his resignation to the Governor#KarnatakaElectionResults2023 pic.twitter.com/VKMinLgKPu— ANI (@ANI) May 13, 2023