Page Loader
Karnataka Congress: కేంద్రానికి వ్యతిరేకంగా దిల్లీలో 135 మంది కర్ణాటక ఎమ్మెల్యేల ఆందోళన
Karnataka Congress: కేంద్రానికి వ్యతిరేకంగా దిల్లీలో 135 మంది కర్ణాటక ఎమ్మెల్యేల ఆందోళన

Karnataka Congress: కేంద్రానికి వ్యతిరేకంగా దిల్లీలో 135 మంది కర్ణాటక ఎమ్మెల్యేల ఆందోళన

వ్రాసిన వారు Stalin
Feb 07, 2024
11:49 am

ఈ వార్తాకథనం ఏంటి

కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రానికి వ్యతిరేకంగా దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బుధవారం నిరసనకు దిగింది. రాష్ట్రాన్ని కేంద్రం విస్మరిస్తోందని, పన్నులు బదిలీ చేయడం లేదని, ఆర్థిక సాయం చేయడం లేదని ఆరోపిస్తూ.. కాంగ్రెస్ ఈ నిరసన చేస్తోంది. ఇప్పటికే సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో పాటు కర్ణాకటకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జంతర్ మంతర్ వద్దకు చేరుకున్నారు. కాంగ్రెస్ నిరసనపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ.. కేంద్రం తమ నిరసనను వింటుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంతో పాటు కన్నడిగుల ప్రయోజనాలను కాపాడడమే తమ ప్రధాన ఉద్దేశం అన్నారు. కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే మాట్లాడుతూ.. పన్నుల పంపిణీపై కన్నడిగుల ప్రయోజనాలను కాపాడటానికి తాము ఇక్కడికి వచ్చినట్లు పేర్కొన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మీడియాతో మాట్లాడుతున్న సిద్ధరామయ్య