సీఎం సిద్దరామయ్యపై శివకుమార్ సంచలన వ్యాఖ్యలు; కర్ణాటక కాంగ్రెస్‌లో దమారం
ఈ వార్తాకథనం ఏంటి
కర్ణాటక సీఎం సిద్దరామయ్యపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు.
బెంగళూరులోని హెబ్బాల్‌లో స్టీల్ బ్రిడ్జి నిర్మాణం విషయంలో సిద్ధరామయ్యపై శివకుమార్ చేసిన వ్యాఖ్యలతో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తే అవకాశం ఉంది.
2017లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో బెంగళూరులో స్టీల్ బ్రిడ్జి నిర్మాణానికి వ్యతిరేకంగా నిరసనలు తలెత్తడంతో సీఎం సిద్ధరామయ్య, కేజే జార్జ్(అప్పటి బెంగళూరు నగరాభివృద్ధి మంత్రి) భయపడ్డారని శివకుమార్ చెప్పారు.
అదే తాను అయితే నిరసనకారుల బెదిరింపులకు లొంగిపోనని, పర్యవసానంగా ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి ఉండేవాడినన్నారు.
విధానసౌధలో కెంపేగౌడ జయంతి సందర్భంగా శివకుమార్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే శివకుమార్ ఈ మాటలు అన్న సమయంలో సిద్ధరామయ్య ఆ కార్యక్రమంలో లేరు.
కర్ణాటక
కొన్నిసార్లు మంచి నిర్ణయాలు ఆలస్యం అవుతాయ్: ప్రియాంక్ ఖర్గే
భవిష్యత్తులోనూ బెంగళూరుకు సహాయపడే కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవడానికి తాను వెనుకాడబోనని శివకుమార్ తెలిపారు. ఇప్పుడు కూడా తాను కొన్ని నిర్ణయాలు తీసుకుంటానని చెప్పారు.
సిద్ధరామయ్యపై శివకుమార్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రి ప్రియాంక్ ఖర్గే స్పందించారు.
సిద్ధరామయ్య భయపడినట్లు తాను చెప్పనన్నారు. అయితే ముఖ్యమంత్రి ప్రజాభిప్రాయానికి బద్ధులై ఉంటారని చెప్పారు. కొన్నిసార్లు మంచి నిర్ణయాలు ఆలస్యం అవుతాయని, సీఎం ఉద్దేశం అదేనని నేను తాను అనుకుంటున్నట్లు వెల్లడించారు.
ప్రస్తుతం శివకుమార్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో దుమారాన్ని రేపుతున్నాయి. ఈ వ్యవహారంలో శివకుమార్‌ను కొందరు సమర్థిస్తుండగా, సిద్ధరామయ్యకు కొందరు మద్దతు ఇస్తున్నారు.