Page Loader
Karnataka Teacher: 'పాకిస్థాన్ వెళ్లిపోండి'.. ముస్లిం విద్యార్థులపై టీచర్ వివాదాస్పద వ్యాఖ్యలు
ముస్లిం విద్యార్థులపై మతపరమైన వ్యాఖ్యలు.. టీచర్ బదిలీ

Karnataka Teacher: 'పాకిస్థాన్ వెళ్లిపోండి'.. ముస్లిం విద్యార్థులపై టీచర్ వివాదాస్పద వ్యాఖ్యలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 03, 2023
06:18 pm

ఈ వార్తాకథనం ఏంటి

కర్ణాటకలో ఓ టీచర్ క్లాస్ రూంలో విద్యార్థులపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. గొడవ పడుతున్న ఇద్దరు ముస్లిం విద్యార్థులను ఉద్ధేశించి మతపరమైన వ్యాఖ్యలను చేసినట్లు విద్యార్థులు ఆరోపించారు. ఈ మేరకు విద్యార్థులు వారి తల్లిదండ్రులు కలిసి ఉన్నతాధికారులకు ఫిర్యాదు కూడా చేశారు. ఈ ఘటన శివమొగ్గ జిల్లాలోని ఓ ఉర్దూ ఇన్‌స్టిట్యూషన్‌లో ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. విద్యార్థులతో వాగ్వివాదం కారణంగా టీచర్ మంజులా దేవి 'పాకిస్థాన్ కు వెళ్లండి' అని చెప్పిందని విద్యార్థులు ఆరోపించారు. కొందరు ముస్లిం విద్యార్థులు ఆమెపై ఉన్నతాధికారులు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

Details

విద్యార్థుల ఫిర్యాదు ఆధారంగా టీచర్ పై చర్యలు

తొమ్మిదేళ్లుగా పాఠశాలలో కన్నడ బోధించే మంజులా దేవిని ఉన్నతాధికారులు బదిలీ చేశారు. ఆరోపణలకు కచ్చితమైన ఆధారాలు లభించనపప్పటికీ, విద్యార్థుల ఫిర్యాదు ఆధారంగా చర్య తీసుకున్నట్లు బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పి.నాగారాజు తెలిపారు. ఇదిలా ఉండగా, ఉత్తరప్రదేశ్, దిల్లీ ఘటన తర్వాత మళ్లీ కర్ణాటకలో ఇలాంటి ఘటన తాజాగా వెలుగులోకి రావడం చర్చనీయాంశమైంది. ఇక యూపీలోని ముజఫర్ నగర్ లో ఓ ముస్లిం విద్యార్థిని తోటి పిల్లలతో టీచర్ కొట్టించారు. దిల్లీ కూడా ఓ టీచర్ విద్యార్థులను పాక్‌కు వెళ్లాలని సూచించిన విషయం తెలిసిందే.