Page Loader
కేరళ: రైలులో గొడవ; తోటి ప్రయాణికుడికి నిప్పంటించిన వ్యక్తి; రైల్వే ట్రాక్‌పై మూడు మృతదేహాలు
రైలులో గొడవ; తోటి ప్రయాణికుడికి నిప్పంటించిన వ్యక్తి

కేరళ: రైలులో గొడవ; తోటి ప్రయాణికుడికి నిప్పంటించిన వ్యక్తి; రైల్వే ట్రాక్‌పై మూడు మృతదేహాలు

వ్రాసిన వారు Stalin
Apr 03, 2023
09:39 am

ఈ వార్తాకథనం ఏంటి

కేరళలోని కోజికోడ్‌లో ఎలత్తూర్‌ సమీపంలో కదులుతున్న రైలులో దారుణం జరిగింది. తోటి ప్రయాణికుడితో ఓ వ్యక్తి వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన అతడు తోటి ప్రయాణికుడికి నిప్పటించాడు. ఆ మంటలు మరికొంతమంది ప్రయాణికులకు అంటుకోవడంతో మొత్తం ఎనిమిది మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. అలప్పుజా-కన్నూరు ఎగ్జిక్యూటివ్ ఎక్స్‌ప్రెస్ రైలులోని డీ1 కంపార్ట్‌మెంట్‌లో ఆదివారం రాత్రి 10 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ప్రయాణికులు ఎమర్జెన్సీ చైన్‌ని లాగిన తర్వాత రైలు వేగాన్ని తగ్గించడంతో నిందితుడు తప్పించుకున్నట్లు రైల్వే వర్గాలు తెలిపాయి.

కేరళ

100మీటర్ల దూరంలో మూడు మృతదేహాల లభ్యం

ఇతర ప్రయాణికులు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పీఎఫ్)కి సమాచారం అందించిన వెంటనే మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనలో గాయపడిన వారిని వెంటనే ఆర్పీఎఫ్‌ సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. ఇద్దరు ప్రయాణికుల వాగ్వాదమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఇదిలా ఉంటే, అదే రైల్వే ట్రాక్‌పై 100మీటర్ల దూరంలో మూడు మృతదేహాలు లభ్యమయ్యాయి. ముగ్గురూ ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం గమనార్హం. దీంతో ఈ రెండు ఘటనలకు ఏమైనా సంబంధం ఉందా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.