Kerala: కేరళలో యువకుడి దారుణం.. ప్రియురాలిని ఇంటికి తెచ్చి.. ఆపై ఇంట్లోవాళ్లని హతమార్చి!
ఈ వార్తాకథనం ఏంటి
కేరళలో ఘోర ఘటన చోటుచేసుకుంది.ఓ యువకుడు తన కుటుంబ సభ్యులతో పాటు ప్రియురాలిపై దాడికి పాల్పడ్డాడు.
ఈ దారుణఘటనలో ఐదుగురు మృతి చెందగా, అతని తల్లి, ప్రియురాలు ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఈ ఘటన తిరువనంతపురం సమీపంలో చోటుచేసుకుంది.
సంఘటన వివరాలు
సోమవారం సాయంత్రం వెంజరమూడు (Venjaramoodu) పోలీస్ స్టేషన్‌కు ఓ యువకుడు వచ్చి, తన కుటుంబ సభ్యులను చంపినట్టు చెప్పి పోలీసులకు లొంగిపోయాడు.
ఈ ఘటనపై ఆరా తీసిన పోలీసులు.. అది నిజమేనని తేలడంతో షాక్‌కి గురయ్యారు.
ఇదే సమయంలో, ఆ యువకుడు తనతో తీసుకువచ్చిన ఎలుకల మందు తాగి స్టేషన్‌లోనే కుప్పకూలాడు.
వెంటనే అతన్ని తిరువనంతపురం మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు.
వివరాలు
ప్రేమ వ్యవహారం - హత్యలకు దారి
పెర్‌ములాలో నివాసం ఉన్న అఫన్ (Afan) అనే యువకుడు, స్థానికంగా బీఎస్సీ చదువుతున్న ఫర్‌సనా (Farsana) అనే యువతితో ప్రేమలో ఉన్నాడు.
వారి ప్రేమకు ఫర్‌సనా కుటుంబ సభ్యులు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు.
అయితే, కొన్ని రోజుల క్రితం అఫన్ తన ప్రియురాలిని తన ఇంటికి తీసుకువచ్చాడు.
అయితే, ఏమి జరిగిందో తెలియదు కానీ సోమవారం అతను తన ఇంట్లోనే తన తల్లి షమీ, తమ్ముడు అఫ్సన్ (13) ప్రియురాలు ఫర్‌సనాపై తీవ్రంగా దాడి చేశాడు.
వివరాలు
వరుస హత్యలు
ఈ దాడి అనంతరం, అఫన్ బైక్‌పై ఎన్‌ఎన్‌పురానికి వెళ్లి, తన మేనమామ లతీఫ్ (69) ఆయన భార్య షాహిదా (59)లను హత్య చేశాడు.
అక్కడి నుంచి పాంగోడ్‌లో ఉన్న తన బామ్మ సల్మా బీవీని కూడా హత్య చేశాడు. కేవలం 16 కిలోమీటర్ల పరిధిలోనే అతను ఈ వరుస హత్యలకు పాల్పడ్డాడు.
అనంతరం, నేరుగా పోలీస్ స్టేషన్‌కి వెళ్లి లొంగిపోయాడు.
దర్యాప్తు, అనుమానాలు
అఫన్ దాడిలో తీవ్రంగా గాయపడిన అతని తల్లి షమీ, ప్రియురాలు ఫర్‌సనా ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
వారి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు సమాచారం. మరోవైపు, తనను అడ్డుకున్న ఆస్పత్రి సిబ్బందితో వాగ్వాదానికి దిగిన అఫన్, చికిత్సను నిరాకరించాడు. పోలీసులు బలవంతంగా అతనికి చికిత్స చేయించారు.
వివరాలు
దర్యాప్తు, అనుమానాలు
అఫన్‌కు డ్రగ్స్ అలవాటు ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
మత్తు ప్రభావంతోనే అతను ఈ దారుణానికి పాల్పడి ఉంటాడని భావిస్తున్నారు. ప్రస్తుతం అతని రక్త నమూనాలను సేకరించి పరీక్షలకు పంపారు.
అన్ని కోణాల్లోనూ దర్యాప్తు కొనసాగుతోందని, మంగళవారం అఫన్‌ను విచారణకు తీసుకుంటామని వెంజరమూడు పోలీసులు వెల్లడించారు.