Page Loader
TG Non Local: విద్యాశాఖ కీలక నిర్ణయం.. తెలంగాణలో నాన్-లోకల్ కోటా రద్దు!
విద్యాశాఖ కీలక నిర్ణయం.. తెలంగాణలో నాన్-లోకల్ కోటాకు గ్రీన్ సిగ్నల్!

TG Non Local: విద్యాశాఖ కీలక నిర్ణయం.. తెలంగాణలో నాన్-లోకల్ కోటా రద్దు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 28, 2025
11:16 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ ప్రభుత్వం నాన్-లోకల్ కోటాను పూర్తిగా రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై తెలంగాణలో ఈ కోటా పూర్తిగా స్థానిక విద్యార్థులకు మాత్రమే వర్తించనుంది. 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు విద్యను ఆధారంగా తీసుకుని స్థానికతను గుర్తించనున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇంజనీరింగ్, ప్రొఫెషనల్ కోర్సుల్లో అమల్లో ఉన్న 15% నాన్-లోకల్ కోటాను ప్రభుత్వం రద్దు చేసింది. 2025-26 విద్యా సంవత్సరంలో మేనేజ్‌మెంట్ కోటా మినహా అన్ని సీట్లు తెలంగాణ విద్యార్థులకే కేటాయించనున్నారు. దీంతో, ఇకపై ఏపీ విద్యార్థులు ఈ కోటాలో దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు కారు.

Details

 నాన్-లోకల్ కోటా రద్దుకు కారణం 

రాష్ట్ర విభజన సమయంలో 15% నాన్-లోకల్ కోటాకు పదేళ్ల గడువు విధించారు. 2024 జూన్ 2 నాటికి ఈ గడువు ముగిసినా, అప్పటికే అడ్మిషన్ ప్రక్రియ ప్రారంభమవ్వడంతో గతేడాది ఈ కోటా కొనసాగింది. తాజాగా తెలంగాణ విద్యాశాఖ నాన్-లోకల్ కోటా రద్దుపై స్పష్టతనిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కీలక మార్పులు విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా జీవో 15 విడుదల చేశారు. కన్వీనర్ కోటాలో ఉన్న 70శాతం సీట్లలో 85శాతం స్థానికులకు కేటాయిస్తారు. మిగిలిన 15శాతం సీట్లు నాన్-లోకల్ కోటాగా కొనసాగింది. అయితే తాజా ఉత్తర్వుల ప్రకారం, ఈ కోటా పూర్తిగా తొలగించారు.

Details

నాన్-లోకల్ కోటాపై మార్గదర్శకాలు

2011లో జారీ చేసిన జీవో 74 ప్రకారం, ఉమ్మడి ఏపీలో నాన్-లోకల్ కోటా కోసం ఓయూ రీజియన్, ఆంధ్రా యూనివర్సిటీ (ఏయూ), శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ (ఎస్కేయూ) విద్యార్థులు పోటీ పడేందుకు అనుమతించారు. కానీ తాజా జీవో ప్రకారం, ఇకపై తెలంగాణలో ఓయూ రీజియన్ విద్యార్థులకే అవకాశం ఉంటుంది. 1.తల్లిదండ్రులు ఉపాధి కారణంగా ఇతర రాష్ట్రాల్లో ఉన్నా, గతంలో 10 సంవత్సరాలు తెలంగాణలో నివసించినవారి పిల్లలు ఈ కోటా కోసం రెసిడెన్స్ సర్టిఫికేట్ పొందాల్సి ఉంటుంది. 2. ఇతర రాష్ట్రాలకు చెందినవారు తెలంగాణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, విశ్వవిద్యాలయాలు, స్థానిక సంస్థల్లో పనిచేస్తే, వారి పిల్లలు ఈ కోటాకు అర్హులు.

Details

నాన్-లోకల్ కోటా వర్తించే కోర్సులు

ఈ కోటా ఇంజనీరింగ్, టెక్నాలజీ, ఫార్మసీ, ఆర్కిటెక్చర్, ఫార్మా డి, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, కంప్యూటర్ అప్లికేషన్స్, లా, ఎడ్యుకేషన్, ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సులకు వర్తిస్తుంది. ఈ కోర్సుల్లో అండర్ గ్రాడ్యుయేట్, పీజీ సీట్ల భర్తీకి ఈ నిబంధనలు అమలులో ఉంటాయి. తెలంగాణ స్థానికత ఎలా నిర్ణయిస్తారు? 6వ తరగతి నుండి ఇంటర్ వరకు చదివిన విద్యార్థులను తెలంగాణ స్థానికులుగా పరిగణిస్తారు. బీటెక్, బీఫార్మసీ, బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ వెటర్నరీ సైన్స్ వంటి కోర్సుల అడ్మిషన్లకు 9వ తరగతి నుండి ఇంటర్ వరకు నాలుగేళ్లు తెలంగాణలో చదవడం తప్పనిసరి. కన్వీనర్ కోటాలో ఉండే మొత్తం 70శాతం సీట్లలో 85శాతం స్థానికులకే కేటాయిస్తారు. మిగిలిన 15% అన్-రిజర్వ్డ్ కోటాలో రిజర్వేషన్లు కొనసాగుతాయి.

Details

ఏపీ విద్యార్థులకు ఇక అవకాశం లేదా?

ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో గతంలో పెద్ద సంఖ్యలో ఏపీ విద్యార్థులు నాన్-లోకల్ కోటాలో పోటీ పడేవారు. ప్రతి ఏడాది దాదాపు 60,000 మంది ఆంధ్రా విద్యార్థులు ఈ కోటా కింద తెలంగాణలో ప్రవేశాలు పొందేవారు. అయితే తాజా ఉత్తర్వులతో ఇకపై ఈ అవకాశం లేకుండా పోయింది. తెలంగాణలో చదవాలంటే, మేనేజ్‌మెంట్ కోటాలో మాత్రమే ప్రవేశం పొందాల్సి ఉంటుంది.

Details

 ఏపీలో ఇంజనీరింగ్ సీట్లకు డిమాండ్ పెరుగుతుందా?

2023లో తెలంగాణ ఈఏపీ సెట్‌కు 3,54,803 మంది హాజరయ్యారు. ఇంజనీరింగ్ విభాగంలో 49,071 మంది ఏపీ విద్యార్థులు హాజరయ్యారు. అగ్రికల్చర్, ఫార్మా విభాగంలో 12,349 మంది ఏపీ విద్యార్థులు హాజరయ్యారు. మొత్తంగా 61,420 మంది ఏపీ విద్యార్థులు పరీక్ష రాశారు. నాన్-లోకల్ కోటా రద్దుతో ఈ విద్యార్థులంతా ఇప్పుడు ఏపీ కాలేజీల్లోనే ప్రవేశాలు పొందాల్సి ఉంటుంది. దీని ప్రభావంగా ఏపీలో ఇంజనీరింగ్, ప్రొఫెషనల్ కోర్సుల సీట్లకు డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. ప్రతి ఏడాది దాదాపు 12,000 మంది ఏపీ విద్యార్థులు తెలంగాణ నాన్-లోకల్ కోటాలో ప్రవేశం పొందేవారు. ఇకపై వీరంతా ఏపీ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం పోటీ పడనున్నారు.

Details

ఏపీ విద్యార్థులకు ఆటంకం

తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో నాన్-లోకల్ కోటాకు ముగింపు పలికింది. ఇది తెలంగాణ విద్యార్థులకు లాభదాయకంగా మారినా, ఏపీ విద్యార్థులకు మాత్రం పెను ఆటంకంగా మారనుంది. తెలంగాణలో చదవాలంటే ఇకపై మేనేజ్‌మెంట్ కోటానే ఏకైక మార్గంగా మారింది. ఇదే సమయంలో ఏపీలో ఇంజనీరింగ్, ప్రొఫెషనల్ కోర్సులకు డిమాండ్ పెరిగే అవకాశం ఉంది.