Page Loader
Uttar Pradesh : యూపీలో తప్పిన ఘోర రైలు ప్రమాదం.. రెండుగా విడిపోయిన కిసాన్ ఎక్స్‌ప్రెస్
యూపీలో తప్పిన ఘోర రైలు ప్రమాదం.. రెండుగా విడిపోయిన కిసాన్ ఎక్స్‌ప్రెస్

Uttar Pradesh : యూపీలో తప్పిన ఘోర రైలు ప్రమాదం.. రెండుగా విడిపోయిన కిసాన్ ఎక్స్‌ప్రెస్

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 25, 2024
02:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తర్‌ప్రదేశ్ లో ఘోర రైలు ప్రమాదం తప్పింది. ఈ మధ్య తరుచూ రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని బిజ్నోర్‌లో కిసాన్ ఎక్స్‌ప్రెస్ రైలు రెండు భాగాలుగా విడిపోయింది. బిజ్నోర్‌లోని సియోహరా రైల్వే స్టేషన్‌ సమీపంలో ఈ ఘటన జరిగింది. సాంకేతిక లోపం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని రైల్వే ఆధికారులు పేర్కొన్నారు. రైలులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఎటువంటి గాయాలు కాలేదు.

Details

యూపీ ఎక్స్ ప్రెస్

యూపీ పోలీస్ రిక్రూట్‌మెంట్ పరీక్షకు వెళుతున్న అభ్యర్థులు సూమారుగా 150 మంది ఇందులో ప్రయాణించారు. మొత్తంగా 1600 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఈ రైలు రెండుగా విడిపోయింది. ప్రస్తుతం రైల్వే శాఖ అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. ఈ కిసాన్ ఎక్స్‌ప్రెస్ రైలు ఫిరోజ్‌పూర్ నుండి ధన్‌బాద్ వెళ్తోంది. ఈ రైలులో మొత్తం 22 కోచ్‌లు ఉండగా, వాటిలో ఎనిమిది కోచ్‌లు వేరయ్యాయి.