Page Loader
Kolkata Doctor Murder Case: వైద్యులు విధుల్లో చేరాలన్న సుప్రీంకోర్టు
వైద్యులు విధుల్లో చేరాలన్న సుప్రీంకోర్టు

Kolkata Doctor Murder Case: వైద్యులు విధుల్లో చేరాలన్న సుప్రీంకోర్టు

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 22, 2024
12:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌కు చెందిన డాక్టర్‌పై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో సుప్రీంకోర్టులో ఈరోజు మళ్లీ విచారణ కొనసాగుతోంది. విచారణ సందర్భంగా సీజేఐ డివై చంద్రచూడ్ మాట్లాడుతూ.. వైద్యులపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని చెప్పారు. వారు తిరిగి పనిలోకి వెళ్లాలన్నారు. గత విచారణలో, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం, కోల్‌కతా పోలీసులను సుప్రీంకోర్టు మందలించింది. దర్యాప్తు సంస్థ సీబీఐ, బెంగాల్ ప్రభుత్వం స్టేటస్ రిపోర్టును సుప్రీంకోర్టుకు సమర్పించాయి.

వివరాలు 

వైద్యులు తిరిగి విధుల్లో చేరాలి: సుప్రీంకోర్టు 

ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం.. వైద్యులు తిరిగి విధుల్లో చేరాలని పేర్కొంది. వైద్యులపై చర్యలు తీసుకోవడం లేదు. వారు కలత చెందారని మేము అర్థం చేసుకున్నాము కానీ మీరు తిరిగి తిరిగి విధుల్లో చేరాల్సి ఉంటుందని ప్రధాన న్యాయమూర్తి తెలిపారు. ప్రజలు వారి కోసం ఎదురు చూస్తున్నారు. వైద్యుల సమ్మెతో ఆరోగ్యరంగం అతలాకుతలమవుతోందన్నారు. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన నేషనల్ టాస్క్ ఫోర్స్(NTF)సిఫార్సులను అమలు చేసే వరకు వైద్యులకు మధ్యంతర రక్షణ కల్పించాలని కోరుతూ వైద్యుల సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 'ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆల్‌ ఇండియా మెడికల్‌ అసోసియేషన్‌' (FAIMA)ఈ పిటిషన్‌ దాఖలు చేసింది. ఇందులో సుప్రీం కోర్టులో జరుగుతున్న విచారణలో జోక్యం చేసుకోవాలని కోరారు.

వివరాలు 

సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించాలి: ఐటీ మంత్రిత్వ శాఖ

వైద్యులపై తరచూ హింసాత్మక సంఘటనలు, వారి భద్రతకు బెదిరింపులను ఎదుర్కొంటున్నారని సంస్థ తన పిటిషన్‌లో వాదించింది. హత్యాచారానికి గురైన జూనియర్ డాక్టర్ పేరు, ఫోటో,వీడియోను తొలగించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను తక్షణమే పాటించాలని ఐటీ మంత్రిత్వ శాఖ వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను కోరింది. మరణించిన వైద్యురాలికి సంబంధించిన ఏదైనా గుర్తింపు సమాచారాన్ని వెంటనే తొలగించాలని మంత్రిత్వ శాఖ అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను కోరింది. కోర్టు ఆదేశాలను పాటించకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా మంత్రిత్వ శాఖ తెలిపింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైద్యులు విధుల్లో చేరాలన్న సుప్రీంకోర్టు