Page Loader
Kommineni Srinivasarao:అమరావతి మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు..  యాంకర్‌ కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్టు 
యాంకర్‌ కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్టు

Kommineni Srinivasarao:అమరావతి మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు..  యాంకర్‌ కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్టు 

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 09, 2025
11:39 am

ఈ వార్తాకథనం ఏంటి

అమరావతి ప్రాంతానికి చెందిన మహిళలను కించపరిచే వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు సాక్షి టీవీ యాంకర్‌ కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్ట్‌ చేశారు. ఈ ఘటనలో, హైదరాబాద్‌లోని జర్నలిస్టుల కాలనీలో ఉన్న ఆయన నివాసానికి వెళ్లిన పోలీసులు, ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయన్ను ఏపీకి తరలించారు. ఈ వ్యవహారంపై గుంటూరు జిల్లా తుళ్లూరులోని పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. సాక్షి టీవీ ఛానెల్‌లో జరిగిన ఓ చర్చాకార్యక్రమం సందర్భంగా, రాజధాని రైతులు, మహిళలపై అసభ్యమైన వ్యాఖ్యలు వెలువడినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర మాదిగ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ కంభంపాటి శిరీష చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు అయింది.

వివరాలు 

సాక్షి టీవీ యాజమాన్యంపై కేసులు నమోదు

ఇంతేకాక, తాడికొండ ఎస్సీ రిజర్వేషన్‌ నియోజకవర్గంలోని దళిత మహిళలపై అవమానకరంగా మాట్లాడినట్టు పేర్కొంటూ, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం సహా ఇతర సంబంధిత సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేసినట్టు సమాచారం. ఈ కేసులో కొమ్మినేని శ్రీనివాసరావుతో పాటు జర్నలిస్ట్‌ కృష్ణంరాజు, అలాగే సాక్షి టీవీ యాజమాన్యంపై కూడా కేసులు నమోదు చేసినట్టు తెలుస్తోంది.