తదుపరి వార్తా కథనం

Ktr : హల్లో కేటీఆర్ మామ, హైదరాబాద్'కు డిస్నీల్యాండ్‌ను తీసుకురా ప్లీజ్
వ్రాసిన వారు
TEJAVYAS BESTHA
Nov 29, 2023
10:36 am
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో మరోక రోజులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు హైదరాబాద్‌కు డిస్నీల్యాండ్‌ను తీసుకురావాలని ఓ చిన్నారి మంత్రి కేటీఆర్'ను కోరింది.
సురేంద్ర వినాయకం అనే వ్యక్తి తన కుమార్తె అడిగిన ప్రశ్నను Xలో పోస్ట్ చేస్తూ మంత్రికి ట్వీట్ చేశారు.
తెలంగాణ ఎన్నికల సందర్భంగా కేటీఆర్‌కు నా కుమార్తె అభ్యర్థన అని క్యాప్షన్ జోడించారు.
కేటీఆర్ మామా, హైదరాబాద్‌కి డిస్నీల్యాండ్‌ని తీసుకురావా ప్లీజ్ అని సదరు చిన్నారి కోరింది.
దీనిపై తెలంగాణ మంత్రి, సిరిసిల్ల బీఆర్ఎస్ అభ్యర్థి కేటీఆర్ గురువారం స్పందించారు.
డిస్నీల్యాండ్‌ను హైదరాబాద్‌కు తీసుకువస్తానని హామీ ఇవ్వలేనని, అయితే తప్పకుండా ఈ దిశగా ప్రయత్నిస్తానని చెప్పుకొచ్చారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
హైదరాబాద్'కు డిస్నీల్యాండ్‌ను తేవాలన్న చిన్నారి.. స్పందించిన కేటీఆర్
Can’t promise Beta but will try my best 👍 https://t.co/YwWrgHwBNH
— KTR (@KTRBRS) November 28, 2023