
Kuna Srisailam Goud : కాంగ్రెస్ లో చేరిన కూన శ్రీశైలం గౌడ్
ఈ వార్తాకథనం ఏంటి
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా..తెలంగాణ రాజకీయాల్లో పరిణామాలన్ని మారుతున్నాయి. ఈ క్రమంలోనే బీజేపీ నేత,కూన శ్రీశైలం గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఏఐసీసీ ఇంచార్జి దీపాదాస్ మున్షీ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు.
శ్రీశైలంగౌడ్‌కు దీపాస్ మున్షీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈసందర్భంగా జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజలకు సేవ చేయడంలో శ్రీశైలం గౌడ్ కు ఉన్న నిబద్ధతను కొనియాడారు.
రానున్న ఎన్నికల్లో గౌడ్ సారథ్యంలోనే పార్టీ బలోపేతం అవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఏఐసీసీ ఇంఛార్జి దీపాదాస్ మున్షీ కూడా గౌడ్ కు అభినందనలు తెలిపారు.
ఈచేరిక కార్యక్రమంలో మంత్రి శ్రీధర్‌బాబు,మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి,ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
కాంగ్రెస్‌లో చేరిన కూన శ్రీశైలం గౌడ్
కాంగ్రెస్‌లో చేరిన కూన శ్రీశైలం గౌడ్
— Telugu Scribe (@TeluguScribe) April 5, 2024
సీఎం రేవంత్ రెడ్డి, ఇంచార్జ్ దీపా దాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్న కూన శ్రీశైలం గౌడ్. https://t.co/dcZg3Q4V62 pic.twitter.com/r0k5i4pP6N