
Kunal Kamra: షిండేపై వివాదాస్పద వ్యాఖ్యలు.. బాంబే హైకోర్టును ఆశ్రయించిన కునాల్ కమ్రా
ఈ వార్తాకథనం ఏంటి
స్టాండప్ కమెడియన్ కుణాల్ కామ్రా మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో చిక్కుల్లో పడ్డారు.
ఈ అంశానికి సంబంధించి తనపై నమోదైన కేసులను రద్దు చేయాలంటూ ఆయన సోమవారం బాంబే హైకోర్టును ఆశ్రయించారు.
తన వ్యాఖ్యలు రాజ్యాంగం కల్పించిన భావప్రకటన స్వేచ్ఛ, జీవించదలచిన హక్కును పరిరక్షించే పరిధిలోనే ఉన్నాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ కేసుపై విచారణ ఏప్రిల్ 21న జరగనుంది.
ఇటీవల ముంబయిలోని యూనికాంటినెంటల్ హోటల్‌లో ఉన్న హాబిటాట్ కామెడీ స్టూడియోలో ఆయన ప్రదర్శన ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో కుణాల్ కామ్రా 'దిల్ తో పాగల్ హై' అనే హిందీ చిత్రంలోని పాటను పారడీగా పాడుతూ, డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ శిండేను 'గద్దార్'గా (ద్రోహిగా) పేర్కొన్నారు.
వివరాలు
మూడుసార్లు సమన్లు జారీ
దీనితో ఆయనపై అనేక కేసులు నమోదయ్యాయి. ఈ వ్యాఖ్యలకు నిరసనగా శివసేన కార్యకర్తలలో సుమారు 40 మంది హాబిటాట్ స్టూడియోపై దాడికి దిగిన సంఘటన జరిగిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో విచారణ కోసం పోలీసులు ఆయనకు మూడుసార్లు సమన్లు జారీ చేశారు.
కానీ కామ్రా విచారణకు హాజరుకాకపోవడంతో, ఆయన హైకోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మరోవైపు, తమిళనాడులోని విల్లుపురానికి చెందిన కుణాల్ కామ్రా మద్రాసు హైకోర్టులోనూ పిటిషన్ దాఖలు చేశారు.
తన అరెస్ట్‌కు అవకాశం లేకుండా ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరగా, ఏప్రిల్ 7వ తేదీ వరకు అతనికి రక్షణ కల్పిస్తూ కోర్టు తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసింది.