Earthquake : లద్దాఖ్ లో భూకంపం..రిక్టర్ స్కేల్ పై 4.4గా నమోదు
లద్దాఖ్ లో భూకంపం సంభవించింది. ఈ మేరకు కార్గిల్‌కు ఉత్తర-వాయువ్యంగా 314 కి.మీ దూరంలో భూప్రకంపణలు సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. ఈ క్రమంలోనే రిక్టర్ స్కేలుపై భూకంపం తీవ్రత 4.4గా నమోదైంది.మధ్యాహ్నం 1.08 గంటలకు ప్రకంపనలు సంభవించాయి. 20 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం కేంద్రీకృతమైనట్లు ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ స్పష్టం చేసింది. దీంతో 4.4 తీవ్రత భూకంపం సంభవించినట్లు వెల్లడించింది. మంగళవారం శ్రీలంకలోని కొలంబోలో రిక్టర్ స్కేలుపై 6.2 తీవ్రతతో మరో భూకంపం సంభవించింది. మధ్యాహ్నం 12.31 గంటలకు భూప్రకంపనలు మొదలైంది. అయితే భూకంప కేంద్రం మాత్రం 10 కిలోమీటర్ల లోతులోనే ఉండటం గమనార్హం. కొలంబోకు ఆగ్నేయంగా 1326 కి.మీ దూరంలో భూకంపం సంభవించింది.