Page Loader
India-Middle East-Europe corridor: 'భారత్-మిడిల్ ఈస్ట్-యూరప్' కనెక్టివిటీ కారిడార్ ప్రారంభం 
జీ20 సమ్మిట్ వేదికగా 'భారత్-మిడిల్ ఈస్ట్-యూరప్' కనెక్టివిటీ కారిడార్ ప్రారంభం

India-Middle East-Europe corridor: 'భారత్-మిడిల్ ఈస్ట్-యూరప్' కనెక్టివిటీ కారిడార్ ప్రారంభం 

వ్రాసిన వారు Stalin
Sep 09, 2023
07:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

జీ20 సదస్సు వేదికగా చారిత్ర ఒప్పందం జరిగింది. వాణిజ్య సంబంధాలను పెంపొందించే ప్రయత్నంలో 'భారత్-మిడిల్ ఈస్ట్-యూరప్' కనెక్టివిటీ కారిడార్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. కనెక్టివిటీ, స్థిరమైన అభివృద్ధికి ఇది కొత్త దిశను సూచిస్తుందన్నారు. రాబోయే కాలంలో ఈ కారిడార్ ఆర్థిక ఏకీకరణకు సమర్థవంతమైన మాధ్యమంగా మారుతుందని పేర్కొన్నారు. ఈ కారిడార్ ప్రారంభాన్ని చారిత్రక ఒప్పందంగా మోదీ అభివర్ణించారు. మానవ నాగరికత అభివృద్ధికి బలమైన కనెక్టివిటీ, మౌలిక సదుపాయాలు అవసరమని మోదీ నొక్కి చెప్పారు. కారిడార్‌ ప్రారంభంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. ఇది నిజంగా చాలా పెద్ద విషయమని మోదీ అన్నారు. తాను ప్రధాని మోదీకి కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు.

కారిడార్

40శాతం పెరగనున్న భారతదేశం, ఐరోపా వాణిజ్యం

కారిడార్ ప్రారంభం అనేది చారిత్రాకతమైన ప్రయోగంగా యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయెన్ చెప్పుకొచ్చారు. తాజా ఒప్పందంతో సామాజిక, డిజిటల్, ఆర్థిక మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెరగనున్నాయి. వాణిజ్య కారిడార్ ప్రారంభంతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, జోర్డాన్, ఇజ్రాయెల్‌తో సహా మిడిల్ ఈస్ట్ అంతటా రైల్వేలు, పోర్ట్ సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. భారతదేశం, ఐరోపా మధ్య వాణిజ్యాన్ని 40శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. వాణిజ్య కారిడార్ అందుబాటులోకి రావడం వల్ల డబ్బు, సమయం రెండూ ఆదా అవుతాయని యురేషియా గ్రూప్‌లోని దక్షిణాసియా ప్రాక్టీస్ హెడ్ ప్రమిత్ పాల్ చౌధురి చెప్పారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కారిడార్ లాంచ్‌తో పెరగనున్న పెట్టుబడులు