
CJI Justice BR Gavai: సెలవుల్లో పనిచేయడానికి న్యాయవాదులు ఇష్టపడటం లేదు: సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్
ఈ వార్తాకథనం ఏంటి
కోర్టుల్లో పెండింగ్ కేసులు భారీగా పేరుకుపోతున్న నేపథ్యంలో,ఈ సమస్యపై ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ కీలకంగా స్పందించారు.
సెలవు రోజులలో లాయర్లు పనిచేయడానికి ఇష్టపడటం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇటీవల ఓ న్యాయవాది వేసవి సెలవుల తర్వాత తన కేసును విచారించాలని కోరిన సందర్భంలో ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయి.
ఈ అభ్యర్థనను జస్టిస్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మాసిహ్‌లతో కూడిన ధర్మాసనానికి ఆ అభ్యర్థన ఆగ్రహం తెప్పించింది
''న్యాయమూర్తులు వేసవి సెలవుల్లో కూడా పనిచేస్తున్నారు.అయినప్పటికీ పెండింగ్ కేసుల విషయంలో మాకు విమర్శలు ఎదురవుతున్నాయి. కానీ,సెలవుల్లో పనిచేయడానికి ఇష్టపడని వారు న్యాయవాదులే'' అని ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు.
వివరాలు
గవాయ్ 52వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు
సుప్రీంకోర్టు వేసవి సెలవుల్లో పనిచేసే ధర్మాసనాల వివరాలను ఇటీవలే నోటిఫికేషన్ ద్వారా ప్రకటించింది.
అయినప్పటికీ, న్యాయ వ్యవస్థపై విమర్శలు కొనసాగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా, ఇటీవలే జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ భారతదేశ 52వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు.
ఆయన 2019 మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. గత ఆరు సంవత్సరాల్లో సుమారు 700 ధర్మాసనాల్లో ఆయన భాగస్వామిగా ఉన్నారు.
జస్టిస్ గవాయ్ అనేక ప్రతిష్టాత్మక, సంచలనాత్మక కేసులపై తీర్పులు ఇచ్చారు. ముఖ్యంగా, ఆర్టికల్ 370 రద్దు, ఎన్నికల బాండ్ల రద్దు, పెద్దనోట్ల రద్దు, ఎస్సీల వర్గీకరణ లాంటివి ప్రధానంగా ఉన్నాయి.
ప్రస్తుతం ఆయన ప్రధాన న్యాయమూర్తిగా నవంబర్ 23, 2025 వరకు కొనసాగనున్నారు.