Narendra Modi : మహనీయుల సేవలను స్మరించుకుందాం : నరేంద్ర మోదీ
ఈ వార్తాకథనం ఏంటి
76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
దేశ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలని, ఈ సందర్భంగా భారత రాజ్యాంగాన్ని రూపుదిద్దిన మహనీయులందరికీ, ప్రజాస్వామ్యం, గౌరవం, ఐక్యతకు పునాది వేసిన వారందరికీ నివాళులర్పిస్తున్నాని చెప్పారు.
ఈ వేడుక మన రాజ్యాంగ విలువలను మరింత బలపరుస్తుందన్నారు.
అలాగే బలమైన, సంపన్నమైన భారతదేశాన్ని నిర్మించే దిశగా మన ప్రయత్నాలను కొనసాగించేందుకు ప్రేరణగా నిలుస్తుందని ఆశిస్తున్నానని మోదీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
Details
ప్రధాని మోదీకి సహకరించాలి : అమిత్ షా
దేశ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలని హోమంత్రి అమిత్ షా పేర్కొన్నారు.
రిపబ్లిక్ డే అనేది భారత రాజ్యాంగ విలువలపై విశ్వాసం, సామాజిక సమానత్వం, ప్రజాస్వామ్యానికి అంకిత భావానికి ప్రతీక అని చెప్పారు.
బలమైన గణతంత్రానికి పునాది వేసిన స్వాతంత్ర్య సమరయోధులు, రాజ్యాంగ నిర్మాతలకు ఈరోజు ప్రత్యేకంగా నివాళులర్పిస్తున్నానని ఆయన వెల్లడించారు.
76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా, అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ను నిలబెట్టేందుకు మనమందరం ప్రధాని మోదీకి సహకరించాలని ప్రతిజ్ఞ చేద్దామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు.