Page Loader
Child Pornography: ఛైల్డ్ పోర్నోగ్రఫీ చూడటం,వీడియోలను డౌన్‌లోడ్ చేయడం నేరం.. సుప్రీం కీలక తీర్పు..
ఛైల్డ్ పోర్నోగ్రఫీ చూడటం,వీడియోలను డౌన్‌లోడ్ చేయడం నేరం.. సుప్రీం కీలక తీర్పు..

Child Pornography: ఛైల్డ్ పోర్నోగ్రఫీ చూడటం,వీడియోలను డౌన్‌లోడ్ చేయడం నేరం.. సుప్రీం కీలక తీర్పు..

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 23, 2024
11:19 am

ఈ వార్తాకథనం ఏంటి

మద్రాసు హైకోర్టు ఇచ్చిన ఛైల్డ్ పోర్నోగ్రఫీ చూడటం నేరం కాదని తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఈరోజు (సోమవారం) కీలక తీర్పు వెల్లడించింది. ఛైల్డ్ పోర్నోగ్రఫీ చూడటం, ఆ వీడియోలను డౌన్‌లోడ్ చేసుకోవడం పోక్సో చట్టం కింద నేరమని స్పష్టం చేసింది. ఈ మేరకు , మద్రాసు హైకోర్టు తీర్పును అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది.

వివరాలు 

 నిందితుడిపై  క్రిమినల్ ప్రాసిక్యూషన్‌ను కొనసాగించాలని ఆదేశం 

ఈ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) డివై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా ఉన్న ధర్మాసనం మద్రాస్ హైకోర్టు తీర్పును జారీ చేయడంలో తీవ్ర తప్పిదం జరిగిందని పేర్కొంది. పోక్సో చట్టం సెక్షన్ 15 ప్రకారం, ఛైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వంటి మెటీరియల్‌ను వీక్షించడం మాత్రమే కాకుండా, వాటిని నిల్వ చేసుకోవడం కూడా నేరమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. మద్రాస్ హైకోర్టు తీర్పును తీవ్ర తప్పిదంగా అభివర్ణిస్తూ, నిందితుడికి ఇచ్చిన ఊరటను ఎత్తివేసి, క్రిమినల్ ప్రాసిక్యూషన్‌ను కొనసాగించాలని ఆదేశించింది. అంతేకాకుండా, కోర్టులు 'ఛైల్డ్ పోర్నోగ్రఫీ' అనే పదాన్ని ఉపయోగించవద్దని సుప్రీం కోర్టు సూచనలు జారీ చేసింది.