
Rail Accident: జార్ఖండ్‌లోఘోర రైలు ప్రమాదం..రెండు గూడ్స్ రైళ్లు ఢీకొని భారీ అగ్నిప్రమాదం.. లోకో పైలెట్లు సహా ముగ్గురు మృతి..!
ఈ వార్తాకథనం ఏంటి
జార్ఖండ్‌లోని సాహిబ్‌గంజ్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. రెండు గూడ్స్ రైళ్లు ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి.
ఈ ఘటనలో మంటలు చెలరేగి రెండు ఇంజిన్లకు మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో లోకో పైలెట్లతో పాటు ముగ్గురు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.
అదనంగా, ముగ్గురు సీఐఎస్‌ఎఫ్ జవాన్లు గాయపడినట్లు తెలుస్తోంది. ఈ ఘటన తెల్లవారు జామున 3:30 గంటలకు జరిగినట్లు సమాచారం.
ఫరక్కా నుంచి లాల్మాటియాకు వెళ్తున్న గూడ్స్ రైలు, బర్హెట్ వద్ద ఆగి ఉన్న మరో గూడ్స్ రైలును ఢీకొట్టినట్లు సమాచారం.
ప్రమాదం వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో, వారు తీవ్ర కష్టంతో మంటలను అదుపులోకి తెచ్చారు.
అయితే, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
వివరాలు
ఒడిశాలో మరో రైలు ప్రమాదం
ఇదే సమయంలో, ఆదివారం ఒడిశాలో మరో రైలు ప్రమాదం జరిగింది.
కామాఖ్య ఎక్స్‌ప్రెస్ రైలు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటన కటక్‌లోని నెర్గుండి రైల్వే స్టేషన్ సమీపంలో జరిగింది.
బెంగళూరుకు చెందిన రైలు నంబర్ 12251, అసోంలోని కామాఖ్య స్టేషన్‌కు వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది.
ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా, ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఒడిశా రాష్ట్రం కటక్ జిల్లాలో ఆదివారం ఈ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పిందని ఓ అధికారి తెలిపారు.
ఎస్‌ఎంవీటీ బెంగళూరు-కామాఖ్య ఏసీ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 11 కోచ్‌లు, మంగూలి సమీపంలోని నెర్గుండిలో ఉదయం 11:54 గంటలకు పట్టాలు తప్పినట్లు అధికారికంగా ప్రకటించారు.