Page Loader
Loksabha : విజిటర్ పాస్ జారీపై లోక్‌సభ స్పీకర్‌ను కలిసిన బీజేపీ ఎంపీ ఏమన్నారంటే
విజిటర్ పాస్ జారీపై లోక్‌సభ స్పీకర్‌ను కలిసిన బీజేపీ ఎంపీ ఏమన్నారంటే

Loksabha : విజిటర్ పాస్ జారీపై లోక్‌సభ స్పీకర్‌ను కలిసిన బీజేపీ ఎంపీ ఏమన్నారంటే

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Dec 14, 2023
12:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

లోక్‌సభ ఛాంబర్‌లోకి అక్రమంగా చొరబడ్డ వారిలో ఒకరికి విజిటర్ పాస్‌ను జారీ చేసిన బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా స్పీకర్ ఓం బిర్లాను కలిశారు. ఈ మేరకు నిందితుడి గురించి వివరించారు. లోక్‌సభ ఛాంబర్‌లోకి దూకిన వారిలో ఒకరికి విజిటర్ పాస్ జారీ చేసిన బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా బుధవారం హౌస్ స్పీకర్ ఓం బిర్లాను కలిసినట్లు విశ్వాసనీయ సమాచారం. నిందితుడి తండ్రి మనోరంజన్ తన నియోజకవర్గం మైసూరులో నివసిస్తున్నారని, కొత్త పార్లమెంటు భవనాన్ని సందర్శించేందుకు పాస్‌ను అభ్యర్థించారని సింహ స్పీకర్‌కు తెలిపారు. దీంతో సాగర్ శర్మ పార్లమెంట్ సందర్శనకు వీలుగా తన పీఏ ఏర్పాట్లు చేశారన్నారు. ఇంతకుమించి తమ వద్ద ఎలాంటి అదనపు సమాచారం లేదని సింహ స్పీకర్‌కు తెలియజేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

స్పీకర్ ఓం బిర్లాను కలిసిన బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా