NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / J&K: జమ్ముకశ్మీర్ రాష్ట్ర హోదా.. కేబినెట్ తీర్మానానికి ఆమోదం తెలిపిన లెఫ్టినెంట్ గవర్నర్..
    తదుపరి వార్తా కథనం
    J&K: జమ్ముకశ్మీర్ రాష్ట్ర హోదా.. కేబినెట్ తీర్మానానికి ఆమోదం తెలిపిన లెఫ్టినెంట్ గవర్నర్..
    జమ్ముకశ్మీర్ రాష్ట్ర హోదా.. కేబినెట్ తీర్మానానికి ఆమోదం తెలిపిన లెఫ్టినెంట్ గవర్నర్..

    J&K: జమ్ముకశ్మీర్ రాష్ట్ర హోదా.. కేబినెట్ తీర్మానానికి ఆమోదం తెలిపిన లెఫ్టినెంట్ గవర్నర్..

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 19, 2024
    05:09 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    జమ్ముకశ్మీర్ కి పూర్తిస్థాయిలో రాష్ట్ర హోదా కల్పించాలని ఆ రాష్ట్ర కేబినెట్ కేంద్రాన్ని కోరింది.

    ఈ తీర్మానానికి జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆమోదం తెలిపారు. కేంద్ర పాలిత ప్రాంతం నుంచి రాష్ట్ర హోదా పునరుద్ధరించాలని సీఎం ఒమర్ అబ్దుల్లా తన మంత్రి వర్గంతో కలిసి కేంద్రాన్ని కోరారు.

    తాజా తీర్మానం జమ్మూ కాశ్మీర్‌కు రాష్ట్ర హోదా గుర్తింపును పునరుద్ధరించడానికి ముఖ్యమైన ముందడుగుగా భావిస్తున్నారు.

    ఈ అంశాన్ని ప్రధానితో పాటు కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది.

    రాష్ట్ర హోదా పునరుద్ధరణకు సంబంధించి ప్రధాన మంత్రి, కేంద్రమంత్రులతో సీఎం ఒమర్ అబ్దుల్లా భేటీ అయ్యేందుకు త్వరలోనే దిల్లీ రానున్నట్లు ఒక ప్రభుత్వ అధికారి వెల్లడించారు.

    వివరాలు 

    రెండో అతిపెద్ద పార్టీగా బీజేపీ

    నవంబర్ 04న శ్రీనగర్‌లో కొత్తగా ఎన్నికైన శాసనసభ సమావేశం జరగనుంది. సెషన్ ప్రారంభంలో లెఫ్టినెంట్ గవర్నర్ ప్రసంగించనున్నారు.

    అక్టోబర్ 21న ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం జరగనుంది, అందుకోసం ముబారిక్ గుల్‌ని ప్రొటెం స్పీకర్‌గా నియమించాలని కేబినెట్ సిఫారసు చేసింది.

    స్పీకర్ ఎన్నిక జరిగే వరకు గుల్ ప్రొటెం స్పీకర్‌గా కొనసాగుతారు, దీనికి సంబంధించి ఎల్‌జీ ఉత్తర్వులు జారీ చేశారు.

    దశాబ్దం తర్వాత, ఆర్టికల్ 370 రద్దు చేసిన అనంతరం తొలిసారిగా జమ్మూ కాశ్మీర్‌లో ఇటీవల ఎన్నికలు జరిగాయి.

    ఈ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్-కాంగ్రెస్ కూటమి మొత్తం 90 అసెంబ్లీ స్థానాల్లో 48 స్థానాలను గెలుచుకుంది.

    బీజేపీ 29స్థానాలతో రెండో అతిపెద్ద పార్టీగా నిలిచింది,అయితే కాంగ్రెస్ కేవలం 6 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జమ్ముకశ్మీర్
    ఒమర్ అబ్దుల్లా

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    జమ్ముకశ్మీర్

    #Newsbytesexplainer: కాశ్మీర్‌లో ఎన్నికలు.. ఢిల్లీలో ఓటింగ్.. కేవలం కాశ్మీరీ పండిట్‌లకు మాత్రమే ఈ ప్రత్యేక సౌకర్యం ఎందుకు లభిస్తుందో తెలుసా? భారతదేశం
    Jammu Kashmir: జమ్ముకశ్మీర్ అసెంబ్లీ అభ్యర్థుల మూడో జాబితా విడుదల  భారతదేశం
    Village Defence Guards: రాజౌరిలో అనుమానాస్పద కదలికలు.. కాల్పులు జరిపిన గ్రామ రక్షణ గర్డ్స్ ఇండియా
    Jammu and kashmir: జమ్ముకశ్మీర్‌లోని రాజౌరీ-కుప్వారాలో మూడు చోట్ల ఎన్‌కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం  భారతదేశం

    ఒమర్ అబ్దుల్లా

    Omar Abdullah: జమ్మూకశ్మీర్‌లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా తొలి తీర్మానం అదే: ఒమర్‌ అబ్దుల్లా భారతదేశం
    Omar Abdullah: నేడే జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం..   జమ్ముకశ్మీర్
    Omar Abdullah: జమ్మూకశ్మీర్‌ సీఎంగా ఒమర్‌ అబ్దుల్లా ప్రమాణం భారతదేశం
    Omar Abdullah: జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదా.. పునరుద్ధరణ కోసం తీర్మానాన్ని ఆమోదించిన ఒమర్ అబ్దుల్లా క్యాబినెట్  జమ్ముకశ్మీర్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025