Page Loader
శివ‌రాజ్ సింగ్ చౌహాన్‌పై రామాయణం నటుడిని బరిలోకి దింపుతున్న కాంగ్రెస్
ముఖ్యమంత్రి శివ‌రాజ్ సింగ్ చౌహాన్‌పై పోటీకి కాంగ్రెస్ ఆంజనేయుడు

శివ‌రాజ్ సింగ్ చౌహాన్‌పై రామాయణం నటుడిని బరిలోకి దింపుతున్న కాంగ్రెస్

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Oct 15, 2023
05:56 pm

ఈ వార్తాకథనం ఏంటి

మ‌ధ్య‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌లకు సంబంధించి 144 మంది కాంగ్రెస్ అభ్య‌ర్ధుల‌ తొలి జాబితా విడుదలైంది. ఈ మేరకు ఆదివారం క్యాండిడేట్ల పేర్లను ప్రకటించింది. అయితే సీఎం శివ‌రాజ్ సింగ్ చౌహాన్‌పై 2008 రామాయ‌ణ్‌లో హ‌నుమాన్ పాత్ర‌ధారిగా నటించిన విక్ర‌మ్ మ‌స్త‌ల్‌ను కాంగ్రెస్ బ‌రిలో నిలిపింది. బుధ్ని అసెంబ్లీ నుంచి కాంగ్రెస్, బీజేపీ తరఫున వీరిద్ద‌రూ త‌ల‌ప‌డ‌నున్నారు. ఈ ఏడాది జులైలో క‌మ‌ల్ నాథ్ స‌మ‌క్షంలో మ‌స్త‌ల్ కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. ఈ క్రమంలోనే మ‌స్త‌ల్‌ను కీల‌క నియోజ‌క‌వ‌ర్గంలో ఎన్నిక‌ల బరిలో దింపింది కాంగ్రెస్. బీజేపీ నాలుగో జాబితా ప్రకారం చౌహాన్ బుధ్ని నియోజ‌క‌వ‌ర్గం నుంచే ఎన్నికల పోరులో నిలవనున్నారని పార్టీ వెల్ల‌డించింది. మరోవైపు బుధ్ని నియోజ‌క‌వ‌ర్గం చౌహాన్‌కు కంచుకోట‌గా గుర్తింపు పొందింది.

details

 పీసీసీ చీఫ్ క‌మ‌ల్‌నాథ్‌కు  చింద్వారా టిక్కెట్ 

2018 శాసనసభ ఎన్నికల్లో శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ సీటు నుంచి ఏకంగా 58,999 ఓట్ల ఆధిక్యంతో విజయదుందభి మోగించారు. కాంగ్రెస్ జాబితాలో పీసీసీ చీఫ్ క‌మ‌ల్‌నాథ్ కు చింద్వారా టిక్కెట్ ద‌క్కింది. మాజీ సీఎం దిగ్విజ‌య్ సింగ్ కుమారుడు జైవ‌ర్ధ‌న్ సింగ్ రాఘ‌వ‌ఘ‌డ్ స్ధానం నుంచి చోటు దక్కించుకున్నారు. ఇక మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో గ‌త ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం కొలువుతీరినా క‌మ‌ల్‌నాథ్ ప్రభుత్వం పడిపోయింది. దీంతో శివ‌రాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలో కమళ సర్కార్ ఏర్పడింది. న‌వంబ‌ర్ 17న ఒకే విడ‌త‌లో మ‌ధ్య‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌లు ముగియ‌నున్నాయి. ఈ మేరకు డిసెంబ‌ర్ 3న ఓట్ల లెక్కింపు అనంతరం ఫ‌లితాలు వెలువడనున్నాయి.