Page Loader
మధ్యప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం : దిగ్విజయ్ సింగ్ రాజీనామా.. లేఖ వైరల్
దిగ్విజయ్ సింగ్ రాజీనామా.. లేఖ వైరల్

మధ్యప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం : దిగ్విజయ్ సింగ్ రాజీనామా.. లేఖ వైరల్

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Oct 15, 2023
06:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల ముంగిట కాంగ్రెస్‌ను ఓ వార్త కలవరపెట్టింది. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ రాజీనామా చేసినట్లు ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే ఓ లేఖ ఆయన పేరిట ట్విట్టర్ లో చక్కెర్లు కొడుతోంది. ఓ వైపు ప్రదాన రాజకీయ పార్టీలన్నీ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. మరోవైపు సదరు లేఖ వైరల్‌గా మారింది. దీంతో మధ్యప్రదేశ్ రాజకీయాల్లోనే కలకలం రేగింది. దీనిపై స్పందించిన డిగ్గీ రాజా, తాను రాజీనామా చేయలేదన్నారు. ఆ లేఖను పూర్తిగా తోసిపుచ్చారు. ప్రత్యర్థి పార్టీలు తప్పుడు లేఖలు సృష్టించాయన్నారు. తాను 1971లో కాంగ్రెస్ సభ్యత్వం తీసుకున్నానని, పదవి కోసం పార్టీలో చేరలేదని, సిద్ధాంతాల ప్రభావంతోనే చేరినట్లు తెలిపారు. తుదిశ్వాస వరకు కాంగ్రెస్‌తోనేనన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రాజీనామా వార్తలను ఖండిస్తూ దిగ్విజయ్ వివరణ