Cabinet Expansion: డిసెంబర్ 15న మహారాష్ట్ర కేబినెట్ విస్తరణ.. కొత్త మంత్రులుగా 30 మంది!
మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్య మంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ అధ్యక్షతన బీజేపీ ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణకు సిద్ధమైంది. ఈ విస్తరణ ఆదివారం (డిసెంబర్ 15) మధ్యాహ్నం 3 గంటలకు నాగ్‌పూర్‌లోని రాజ్‌భవన్‌లో ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమంలో దాదాపు 30 మంది కొత్త మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నారు. 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్న శీతాకాల అసెంబ్లీ సమావేశాలకు ముందే ఈ విస్తరణ జరగనుంది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, ఉప ముఖ్యమంత్రులుగా ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్ ప్రమాణస్వీకారం చేసిన తర్వాత మూడు పార్టీల నుండి సీనియర్ నేతలు కూడా కేబినెట్‌లో స్థానం పొందేందుకు పట్టుబడుతున్నట్లు సమాచారం.
ఏక్ నాథ్ షిండే చేతిలో కీలక శాఖలు
మంత్రివర్గ విస్తరణపై అంచనాలు, ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి, ముఖ్యంగా కీలకమైన శాఖల కేటాయింపులపై పట్టణాభివృద్ధి, పర్యాటకం, MSRDC వంటి శాఖలు ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలో ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే, రెవెన్యూ శాఖ పట్ల ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అతి పెద్ద పార్టీగా నిలవగా, శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌తో కూటమిగా ప్రభుత్వం ఏర్పడింది. ఎన్నికల ఫలితాల తర్వాత 12 రోజుల తరువాత మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటుకు సమయం పట్టింది.