Page Loader
 Maharashtra: ఎన్నికల్లో భాగంగా మ్యానిఫెస్టోను రిలీజ్ చేసిన ఎన్సీపీ 
ఎన్నికల్లో భాగంగా మ్యానిఫెస్టోను రిలీజ్ చేసిన ఎన్సీపీ

 Maharashtra: ఎన్నికల్లో భాగంగా మ్యానిఫెస్టోను రిలీజ్ చేసిన ఎన్సీపీ 

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 06, 2024
03:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ (NCP) మ్యానిఫెస్టోను రిలీజ్ చేసింది. బారామతిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ప్రజలనుద్దేశించి అజిత్ పవార్ మాట్లాడారు. తమ ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే కొత్త మహారాష్ట్ర విజన్‌ను అందిస్తామని ప్రకటించారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతామని, రైతులకు వ్యవసాయ సదుపాయాలు అందిస్తామని ఆయన పేర్కొన్నారు మహారాష్ట్రలో మొత్తం 288 శాసనసభ స్థానాలకుగాను నవంబర్ 20న ఒకే విడత పోలింగ్ జరగనుంది. నవంబర్ 23న ఫలితాలను ప్రకటించనున్నారు.

Details

ఎన్సీపీ విడుదల చేసిన మ్యానిఫెస్టో ఇదే

1) గ్రామీణ ప్రాంతాల్లో 2.5 మిలియన్ల ఉద్యోగాల కల్పన 2) లడ్కీ బహిన్ పథకం కింద నెలవారీ సాయం రూ.1,500 నుంచి రూ.2,100కు పెంపు 3) వరి రైతులకు హెక్టారుకు రూ.25,000 బోనస్ 4) వృద్ధాప్య పింఛను రూ.1,500 నుంచి రూ.2,100కు పెంపు 5) షెట్కారీ సన్మాన్ నిధి ద్వారా రైతులకు ఏడాదికి రూ.15,000 6) గ్రామీణ ప్రాంతాల్లో 45,000 'పనంద్' రోడ్ల నిర్మాణం 7) అంగన్‌వాడీలు, ఆశా వర్కర్లకు నెలవారీ జీతం రూ.15,000 8) పునరుత్పాదక ఇంధనానికి ప్రాధాన్యత, విద్యుత్ బిల్లుల్లో 30 శాతం తగ్గింపు