Page Loader
Maharastra: మహారాష్ట్ర ముఖ్యమంత్రిపై నేడు నిర్ణయం, మహాయుతి నేతలతో అమిత్ షా సమావేశం
మహారాష్ట్ర ముఖ్యమంత్రిపై నేడు నిర్ణయం, మహాయుతి నేతలతో అమిత్ షా సమావేశం

Maharastra: మహారాష్ట్ర ముఖ్యమంత్రిపై నేడు నిర్ణయం, మహాయుతి నేతలతో అమిత్ షా సమావేశం

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 28, 2024
09:53 am

ఈ వార్తాకథనం ఏంటి

మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని బీజేపీ దక్కించుకోవచ్చని సమాచారం. శివసేన అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే ఈ దిశగా మెత్తబడ్డట్లు సమాచారం. ముఖ్యమంత్రి ఎంపిక, ప్రభుత్వ ఏర్పాటుపై ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా తుది నిర్ణయం తీసుకోవాలని శిందే బుధవారం ప్రకటించారు. ఈ ప్రకటనతో రెండు మూడు రోజుల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిపై బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకునే అవకాశం ఏర్పడింది. ఫడణవీస్‌కే అత్యధిక అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఈ నెల 30న లేదా వచ్చే నెల 1న కొత్త ప్రభుత్వం ఏర్పడే అవకాశముందని సమాచారం. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై నిర్ణయం తీసుకోవడానికి శిందే, ఫడణవీస్, అజిత్‌ పవార్‌ దిల్లీకి రావాలని బీజేపీ అధిష్టానం ఆహ్వానం పలికినట్లు తెలుస్తోంది.

వివరాలు 

 సీఎం ఎంపిక విషయంలో వారిదే నిర్ణయం: ఎక్ నాథ్  

వారు అమిత్‌ షాతో భేటీ అయ్యాక సీఎం పదవి, ప్రభుత్వ ఏర్పాటుపై స్పష్టత రావచ్చని అంచనా . గురువారం దిల్లీలో మహాయుతి భేటీ జరగనుందని సమాచారం. శిందే మాట్లాడుతూ, "మహాయుతికి చరిత్రాత్మక విజయాన్నికట్టబెట్టిన మహారాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు. ఎన్నికల సమయంలో నిద్ర కూడా లేకుండా పనిచేశా. నా దృష్టిలో ముఖ్యమంత్రి అంటే సామాన్య వ్యక్తి. నేను రైతు కుటుంబం నుండి వచ్చాను. కష్టాలు తెలుసు. మహిళలు, రైతులు వంటి అన్ని వర్గాల సంక్షేమం మా ప్రాధాన్యం. సీఎం గా ఉన్న సమయంలో ప్రధాని మోదీ, అమిత్‌ షా నాకు అండగా నిలిచారు. తాజా పరిణామాలపై వారితో మాట్లాడాను. సీఎం ఎంపిక విషయంలో వారు తీసుకునే నిర్ణయానికి నేను అంగీకరిస్తానని తెలిపాను" అని చెప్పారు.

వివరాలు 

తెరపైకి శ్రీకాంత్‌ శిందే పేరు..

ఇంతలో, మహాయుతి కూటమిలో ఇంకా ఏకాభిప్రాయం సాధించలేదని ఫడణవీస్‌ తెలిపారు. సీఎం పదవి గురించి ఇంకా నిర్ణయం తీసుకోకున్నప్పటికీ, మూడు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని చెప్పారు. అజిత్‌ పవార్‌ మాట్లాడుతూ, "కొత్త ప్రభుత్వం ఈ నెల 30న లేదా వచ్చే నెల 1న ప్రమాణం చేయవచ్చని తెలిపారు." ఇటీవల మహాయుతి ప్రభుత్వం ఏర్పాటులో భాగంగా తన కుమారుడు శ్రీకాంత్‌ శిందేను డిప్యూటీ సీఎం పదవికి నియమించాలని ఏక్‌నాథ్‌ శిందే అభ్యర్థిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం శ్రీకాంత్‌ కల్యాణ్‌ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా ఉన్నారు. ఆయన డిమాండ్ చేస్తూ మహాయుతి కూటమి కన్వీనర్‌ పదవిని కూడా తనకు ఇవ్వాలని సూచిస్తున్నారు.

వివరాలు 

కొత్త ముఖ్యమంత్రిని అంశంపై త్వరలో నిర్ణయం:  సునీల్‌ తట్కరే 

మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిని ఎవరు అనేది అంశంపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్లు ఎన్సీపీ నేత,రాయగఢ్‌ ఎంపీ సునీల్‌ తట్కరే చెప్పారు. నవంబర్ 23న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలైనప్పటికీ, సీఎం పదవిపై ఇంకా క్లారిటీ రాలేదని చెప్పారు. "కొత్త సీఎంను ఎంపిక చేయడానికి మరో రెండు, మూడు రోజులు పట్టవచ్చు. ఆ తర్వాతే ప్రభుత్వం ఏర్పాటు ప్రక్రియ మొదలవుతుంది. బీజేపీ, శివసేన,ఎన్సీపీలు కలిసి మహాయుతి కూటమి ప్రభుత్వం ఏర్పాటు విషయంలో ఎలాంటి స్పష్టతను తీసుకోలేదు.