
Telangana Congress: తెలంగాణ పీసీసీ చీఫ్ గా మహేశ్ కుమార్‌గౌడ్
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మహేశ్ కుమార్‌గౌడ్ నియమితులయ్యారు. ఈ నియామకాన్ని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఒక ప్రకటన ద్వారా తెలిపారు.
పీసీసీ అధ్యక్ష పదవి కోసం ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాస్కీగౌడ్, ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్‌లు పోటీ చేసినప్పటికీ, అధిష్ఠానం ఎమ్మెల్సీ మహేశ్ కుమార్‌గౌడ్ వైపే మొగ్గు చూపింది.
పీసీసీ అధ్యక్షుడిగా జులై 7వ తేదీతో రేవంత్ రెడ్డి పదవీకాలం ముగిసింది. కొత్త అధ్యక్షుడి ఎంపికపై పరిశీలన కొనసాగుతూ, శుక్రవారం అధికారిక ప్రకటన వెలువడింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
తెలంగాణ యూత్ కాంగ్రెస్ చేసిన ట్వీట్
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(టీపీసీసీ) నూతన అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ నియామకం
— Telangana Youth Congress (@IYCTelangana) September 6, 2024
తక్షణమే ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయన్న ఏఐసీసీ
ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్
.@Bmaheshgoud6666 pic.twitter.com/UpPIUlYAD1