TPCC Chief: టీపీసీసీ చీఫ్‌గా మహేశ్ కుమార్ గౌడ్ బాధ్యతల స్వీకరణ
టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ గాంధీ భవన్లో బాధ్యతలను స్వీకరించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇతర మంత్రులు హాజరయ్యారు. గాంధీ భవన్‌లోని ఆయన ఛాంబర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించి బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతల స్వీకరణకు ముందు గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపానికి మహేశ్ కుమార్ గౌడ్ నివాళులర్పించారు. అక్కడి నుంచి గాంధీ భవన్‌కు తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జి దీపాదాస్ మున్షితో కలిసి భారీ ర్యాలీగా వెళ్లారు.
సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు
ఈ సందర్భంగా మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడారు. బడుగు, బలహీన వర్గాలకు సముచిత స్థానం కల్పిస్తానని చెప్పారు. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా తన వంతు ప్రయత్నాలు చేస్తానన్నారు. తన నియామకానికి సహకరించిన సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.