LOADING...
MP Sulata Deo: బిజెడి ఎంపికి ఉద్యోగి అత్యాచారం,హత్య బెదిరింపు.. ప్ర‌క‌ట‌న చేసిన మహీంద్రా గ్రూప్ 
బిజెడి ఎంపికి ఉద్యోగి అత్యాచారం,హత్య బెదిరింపు.. ప్ర‌క‌ట‌న చేసిన మహీంద్రా గ్రూప్

MP Sulata Deo: బిజెడి ఎంపికి ఉద్యోగి అత్యాచారం,హత్య బెదిరింపు.. ప్ర‌క‌ట‌న చేసిన మహీంద్రా గ్రూప్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 19, 2025
12:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

బీజూ జనతా దళ్‌ ఎంపీ సులతా డియోకు బెదిరింపు సందేశాలు పంపిన ఘటన పెద్ద కలకలం రేపింది. ఈ సందేశాలను మహీంద్రా గ్రూపులో పనిచేస్తున్న సత్యబ్రత నాయక్ అనే వ్యక్తి పంపినట్టు గుర్తించారు. తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఆ వ్యక్తి "రేప్ చేసి హత్య చేస్తాను" అంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేసినట్లు బయటపడింది. ఈ సంఘటనపై సంబంధిత అధికారులు ఇప్పటికే విచారణ ప్రారంభించారు. ఈ విషయంపై మహీంద్రా కంపెనీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. అనుచితమైన లేదా అసభ్యకరమైన ప్రవర్తనను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని, అలాంటి వాటిపై తమకు 'జీరో టాలరెన్స్' విధానం ఉన్నట్లు స్పష్టం చేసింది. .

వివరాలు 

సత్యబ్రత నాయక్‌పై కఠిన చర్యలు తీసుకోనున్న కంపెనీ

ఈ ఘటనను అత్యంత సీరియస్‌గా పరిగణిస్తున్నామని, ఆ ఉద్యోగి పై సమగ్ర దర్యాప్తు జరుగుతోందని తెలిపింది. కంపెనీ నిబంధనలకు అనుగుణంగా సత్యబ్రత నాయక్‌పై కఠిన చర్యలు తీసుకోనున్నట్టు వెల్లడించింది. ఇదిలా ఉండగా,సత్యబ్రత నాయక్ పంపిన ఆ బెదిరింపు మెసేజ్‌ల స్క్రీన్‌షాట్‌ను సులతా డియో స్వయంగా తన సోషల్ మీడియా వేదికలో పంచుకున్నారు. ఫేస్‌ బుక్ ప్రొఫైల్‌ ప్రకారం నాయక్ మహీంద్రా నాసిక్ బ్రాంచ్‌లో పనిచేస్తున్నాడని తెలిసింది. అంతేకాదు,ఆ వ్యక్తి బీజేపీ కార్యకర్త అని కూడా ఎంపీ డియో ఆరోపించారు.కానీ,తన ఫిర్యాదు చేసినప్పటికీ కొంతమంది పోలీస్ ఉన్నతాధికారులు పెద్దగా పట్టించుకోలేదని,ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సంఘటనలో సులతా డియోకు మద్దతుగా ప్రతిపక్ష నాయకులు నిలిచారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మహీంద్రా గ్రూప్ చేసిన ట్వీట్ 

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ప్రియాంక చతుర్వేది చేసిన ట్వీట్