Major Radhika Sen: మేజర్ రాధికా సేన్ కి అరుదైన గౌరవం.. ప్రతిష్టాత్మక అవార్డ్ ప్రకటన!
కాంగోలో ఐక్యరాజ్య సమితి (UN) మిషన్‌లో పనిచేసిన భారతీయ మహిళా శాంతి పరిరక్షకురాలు మేజర్ రాధికా సేన్‌ను సైనిక అవార్డుతో సత్కరించనున్నారు. ఈ సందర్భంగా ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ఆమెని ప్రశంసించారు. ఆమెను నిజమైన, ఆదర్శవంతమైన నాయకురాలిగా అభివర్ణించారు. మే 30న అంతర్జాతీయ ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక దినోత్సవం సందర్భంగా మేజర్ రాధికా సేన్‌కు 2023 "యునైటెడ్ నేషన్స్ మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్" అవార్డు ఇవ్వనున్నారు. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ గుటెర్రెస్ ఆమెను ఈ అవార్డుతో సత్కరించనున్నారు.
ఇండియన్ రాపిడ్ డిప్లాయ్‌మెంట్ బెటాలియన్‌కు కమాండర్‌గా రాధికా సేన్
మేజర్ సేన్ మార్చి2023 నుండి ఏప్రిల్ 2024 వరకు ఇండియన్ రాపిడ్ డిప్లాయ్‌మెంట్ బెటాలియన్‌కు కమాండర్‌గా రిపబ్లిక్ ఆఫ్ కాంగో తూర్పున పని చేశారు . ఆమె స్వస్థలం హిమాచల్ ప్రదేశ్.1993లో జన్మించిన ఆమె ఎనిమిదేళ్ల క్రితం భారత సైన్యంలో చేరారు. మేజర్ రాధికా సేన్ బయోటెక్ ఇంజనీర్‌లో పట్టభద్రురాలు.ఆతర్వాతే ఆమె ఇండియన్ ఆర్మీలో చేరాలని నిర్ణయించుకుంది. మేజర్ సుమన్ గవానీ తర్వాత 2023ఐక్యరాజ్యసమితి మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్న రెండవ భారతీయ శాంతి పరిరక్షకురాలు రాధికా. మేజర్ గవానీ ఐక్యరాజ్యసమితి మిషన్‌లో పనిచేశారు. 2019లో ఈఅవార్డుతో సత్కరించబడ్డారు. ప్రస్తుతం ఐక్యరాజ్య సమితికి మహిళా సైనిక శాంతి పరిరక్షకులకు 11వఅతిపెద్ద సహకారం అందిస్తున్న దేశాలలో భారతదేశం ఒకటి