Babbar Khalsa: పంజాబ్‌లో ముగ్గురు బబ్బర్ ఖల్సా ఉగ్రవాదుల అరెస్ట్
ఈ వార్తాకథనం ఏంటి
పంజాబ్‌లో హత్యలకు సంబంధించి ఖలిస్థానీ సంస్థ బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ పన్నిన కుట్రను ఇంటెలిజెన్స్, పోలీసులు భగ్నం చేశారు.
ఈ క్రమంలో ముగ్గురు ఉగ్రవాదులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
అరెస్టైన నిందితులు జగ్‌రూప్ సింగ్ అలియాస్ జగ్గా, సుఖ్‌జిత్ సింగ్ అలియాస్ సుక్కా, నవ్‌ప్రీత్ సింగ్ అలియాస్ నవ్‌గా గుర్తించారు.
వీరి వద్ద నుంచి అత్యాధునిక గ్లాక్ 9ఎంఎం పిస్టోల్, మ్యాగ్జైన్, పీఎక్స్5 స్ట్రామ్ పిస్టోల్, దేశీయంగా తయారైన 30 బోర్ గన్, 32 బోర్ తుపాకీ, తూటాలు స్వాధీనం చేసుకున్నారు.
వివరాలు
అమెరికా కేంద్రంగా పర్యవేక్షణ
ప్రాథమిక దర్యాప్తులో అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న గురుప్రీత్ సింగ్ అలియాస్ గోపీ నౌషహరియా వీరి హ్యాండిలర్‌గా గుర్తించారు.
అతడు పాకిస్థాన్‌లో పనిచేస్తున్న ఖలిస్థానీ ఉగ్రవాది హర్వీందర్ సింగ్ రిండా, గ్రీస్‌లో ఉన్న లాడీ బకాపురియాకు అత్యంత సన్నిహితుడు. నిందితులపై అమృత్‌సర్‌లో కేసు నమోదు చేశారు.
మహా కుంభమేళాలో ఉగ్రదాడికి పథకం
మహా కుంభమేళాలో ఉగ్రదాడికి పథకం వేసిన లాజర్ మసీహ్ను ఉత్తర్‌ప్రదేశ్‌లోని కౌశాంబిలో అరెస్ట్ చేశారు.
అతనికి ఐఎస్ఐ, బబ్బర్ ఖల్సాతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు.
గతంలో ఆయుధాలు, హెరాయిన్ స్మగ్లింగ్ కేసులో ఒకసారి జైలుకు వెళ్లిన మసీహ్, 2024 సెప్టెంబర్ 24న ఆసుపత్రి నుంచి తప్పించుకొని సోనీపత్, ఢిల్లీ ప్రాంతాల్లో తలదాచుకున్నాడు.
వివరాలు
అంతర్జాతీయ ఉగ్రవాదులతో సంబంధాలు
మసీహ్ గతంలో పీలీభిత్‌లో ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన వినేశ్‌సింగ్ అలియాస్ రవితో సంబంధాలు కలిగి ఉన్నాడు.
అతడు అమెరికాలో ఉన్న ఖలిస్థాన్ ఉగ్రవాదితో, ఖతార్‌లో తలదాచుకున్న మరో ఉగ్రవాదితోనూ నేర సంబంధాలు కొనసాగిస్తున్నాడు.
పోలీసుల సమాచారం మేరకు కౌశాంబి జిల్లాలోని కోఖ్రాజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉత్తర్‌ప్రదేశ్ ఎస్‌టీఎఫ్ బృందం, పంజాబ్ పోలీసులు సంయుక్తంగా గురువారం తెల్లవారుజామున 3.30 గంటలకు దాడి చేసి మసీహ్‌ను పట్టుకున్నారు.
భారీగా పేలుడు సామగ్రి స్వాధీనం
అతని నుంచి మూడు గ్రనేడ్లు, రెండు డిటోనేటర్లు, విదేశీ తయారీ పిస్టోల్, 13 క్యాట్రిడ్జ్‌లు, పేలుడు పదార్థాలతో కూడిన పౌడర్, సిమ్ లేని ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. మహా కుంభమేళాలో భద్రత కట్టుదిట్టంగా ఉండటంతో అతడి ఉగ్రదాడి ప్రణాళిక విఫలమైంది.