NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Grenade Attack: అమృత్‌సర్ ఆలయంపై గ్రెనేడ్ దాడి.. పోలీసు ఎన్‌కౌంటర్‌లో నిందితుడు మృతి
    తదుపరి వార్తా కథనం
    Grenade Attack: అమృత్‌సర్ ఆలయంపై గ్రెనేడ్ దాడి.. పోలీసు ఎన్‌కౌంటర్‌లో నిందితుడు మృతి
    అమృత్‌సర్ ఆలయంపై గ్రెనేడ్ దాడి.. పోలీసు ఎన్‌కౌంటర్‌లో నిందితుడు మృతి

    Grenade Attack: అమృత్‌సర్ ఆలయంపై గ్రెనేడ్ దాడి.. పోలీసు ఎన్‌కౌంటర్‌లో నిందితుడు మృతి

    వ్రాసిన వారు Sirish Praharaju
    Mar 17, 2025
    12:38 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    అమృత్‌సర్‌లోని ఓ ఆలయంపై ఇటీవల జరిగిన గ్రెనేడ్ దాడి ఘటనలో ప్రధాన నిందితుడు సోమవారం మరణించాడు.

    గుర్సిదక్‌ సింగ్‌ అనే అనుమానితుడు పంజాబ్‌ పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు, అయితే మరో నిందితుడు తప్పించుకున్నాడు.

    అమృత్‌సర్‌లోని ఒక గుడిపై గ్రెనేడ్ దాడి జరిగిన విషయం తెలిసిందే. శుక్రవారం రాత్రి ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి హ్యాండ్ గ్రెనేడ్ విసిరినట్లు సమాచారం.

    పేలుడు కారణంగా ఆలయ గోడ స్వల్పంగా ధ్వంసమైంది. అర్థరాత్రి జరిగిన ఈ ఘటనను సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించిన పోలీసులు, నిందితుల కోసం గాలింపు చేపట్టారు.

    నిఘా వర్గాల సమాచారంతో నిందితులు రాజసాన్సీ ప్రాంతంలో తిరుగుతున్నట్లు తెలిసింది. దాంతో, సీఐఏ, ఛెహర్తా పోలీసుల బృందం అక్కడ గాలింపు చర్యలు ప్రారంభించింది.

    వివరాలు 

    పోలీసులపై నిందితులు కాల్పులు

    సోమవారం తెల్లవారుజామున, గుర్సిదక్‌ సింగ్‌, విశాల్‌ అనే ఇద్దరు నిందితులు పోలీసులకు ఎదురయ్యారు.

    వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా, నిందితులు తమ వాహనాన్ని వదిలేసి పోలీసులపై కాల్పులు జరిపారు.

    ఈ కాల్పుల్లో హెడ్ కానిస్టేబుల్‌ గురుప్రీత్‌ సింగ్‌ ఎడమ చేతికి, ఇన్‌స్పెక్టర్‌ అమోలక్‌ సింగ్‌కు గాయాలయ్యాయి.

    ఆత్మరక్షణలో భాగంగా ఇన్‌స్పెక్టర్‌ వినోద్‌ కుమార్‌ ఎదురుగా కాల్పులు జరపగా, గుర్సిదక్‌ గాయపడ్డాడు.

    గాయపడిన అధికారులతో పాటు అతడిని సివిల్‌ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించాడు.

    అయితే, అతని సహచరుడు విశాల్‌ పరారైపోయాడు. ప్రస్తుతం అతడి కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అమృత్‌సర్

    తాజా

    PSL : ఉద్రిక్తతల ఎఫెక్టు.. పాక్ సూపర్ లీగ్‌ మ్యాచ్‌లు యూఏఈకి షిఫ్ట్ పాకిస్థాన్
    India-Pakistan Tension: భారత్, పాక్ మ‌ధ్య ఉద్రిక్త‌త‌.. 24 ఎయిర్‌పోర్టుల క్లోజ్‌ ఆపరేషన్‌ సిందూర్‌
    Stock Market:భారత్-పాక్ ఉద్రిక్తతలు.. కుదేలవుతున్న స్టాక్ మార్కెట్లు స్టాక్ మార్కెట్
    Andhra Pradesh: క్రీడా రంగానికి బూస్ట్.. ఆంధ్రప్రదేశ్‌లో అతి పెద్ద ఇంటర్నేషనల్ క్రికెట్ గ్రౌండ్ ఆంధ్రప్రదేశ్

    అమృత్‌సర్

    అమృత్‌పాల్ సింగ్ కోసం కొనసాగుతున్న వేట; పంజాబ్ పోలీసుల ఎదుట లొంగిపోయిన అతని మామ, డ్రైవర్ పంజాబ్
    'ఏకేఎఫ్' పేరుతో ఆర్మీ ఏర్పాటుకు అమృతపాల్ సింగ్‌ ప్రయత్నం; వెలుగులోకి వస్తున్న సంచలన నిజాలు పంజాబ్
    భార్యను అమృత్‌పాల్ సింగ్ తరుచూ కొట్టేవాడు, అమ్మాయిలపై మోజు, థాయ్‌లాండ్‌లో గర్లఫ్రెండ్: నిఘా వర్గాలు పంజాబ్
    పంజాబ్: అమృత్‌పాల్ సింగ్ గోల్డెన్ టెంపుల్‌ వద్ద లొంగిపోవాలనుకున్నాడా? పంజాబ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025