Page Loader
Amritsar: పంజాబ్ అమృత్‌సర్‌లో బాంబు పేలి.. దుండగుడు  మృతి 
పంజాబ్ అమృత్‌సర్‌లో బాంబు పేలి.. దుండగుడు మృతి

Amritsar: పంజాబ్ అమృత్‌సర్‌లో బాంబు పేలి.. దుండగుడు  మృతి 

వ్రాసిన వారు Sirish Praharaju
May 27, 2025
12:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

పంజాబ్ రాష్ట్రంలోని అమృత్‌సర్‌లో బాంబు పేలుడు ఒక కలకలాన్ని సృష్టించింది. నగర బైపాస్ సమీపంలో ఓ అనుమానాస్పద వ్యక్తి బాంబు పెట్టేందుకు యత్నిస్తుండగా,అది అతని చేతిలోనే అకస్మాత్తుగా పేలి ప్రాణాలు కోల్పోయాడు. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించించారు. ఈ సమాచారాన్ని అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాంబ్ స్క్వాడ్‌ను పిలిపించి దర్యాప్తు చేపట్టారు.

వివరాలు 

నిర్మానుష్య ప్రాంతాల్లో బాంబు

డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ పోలీసు తెలిపిన వివరాల ప్రకారం.. అమృత్‌సర్‌ గ్రామీణ జిల్లాలోని కాంబో పోలీసు స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి బైపాస్‌లోని నిర్మానుష్య ప్రాంతాల్లో బాంబు అమర్చేందుకు యత్నించాడు. ఆ సమయంలో ఆ బాంబు అతడి చేతిలోనే అది పేలింది. ఈ ఘటనలో దుండగుడు తీవ్రగాయాలపాలవ్వడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సదరు వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మీడియాతో మాట్లాడుతున్న డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్