పశ్చిమ బెంగాల్‌లో మణిపూర్ తరహా ఘటన.. బీజేపీ మహిళా అభ్యర్థిని నగ్నంగా తిప్పారు
మణిపూర్ మహిళల నగ్న ఊరేగింపు ఘటన మరవకముందే పశ్చిమ బెంగాల్ లో మరో దారుణమైన ఘటన వెలుగు చూసింది. హౌరా జిల్లా దక్షిన్ పంచ్లలో జూలై 8న పంచాయతీ ఎన్నికల సమయంలో టీఎంసీ కార్యకర్తలు పోలింగ్ బూత్‌లో తన బట్టలు విప్పి నగ్నంగా నిల్చోబెట్టారని బీజేపీ మహిళా అభ్యర్థి ఆరోపించింది. ప్రస్తుతం మణిపూర్ ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాజ్వాలలు ఎగిసిపడుతున్న తరుణంలో ఈ ఘటన బయటికి వచ్చింది. దాదాపుగా 40 మంది తృణమాల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలు తన పట్ల అమానుషంగా ప్రవర్తించారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. గ్రామం మొత్తం నగ్నంగా ఊరంతా తిప్పారని బాధితురాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది.
మమతా బెనర్జీ రాజీనామా చేయాలి: బీజేపీ
పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన టీఎంసీ అభ్యర్థి హిమంత రాయ్ తన అనుచరులతో కలిసి తన బట్టలు విప్పించారని, అనంతరం తన తల ఛాతిపై కర్రలతో తీవ్రంగా దాడి చేశారని ఆమె వెల్లడించింది. ప్రస్తుతం ఈ ఘటనపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై విమర్శలు వెలువత్తున్నాయి. మమతా బెనర్జీకి భయపడి బెంగాల్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేయలేదని బీజేపీ అధ్యక్షుడు సుకాంత ముజుందార్ మండిపడ్డారు. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే మమతా బెనర్జీ సీఎం పదవికి రాజీనామా చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.