మణిపూర్‌లో ఆగని హింసకాండ.. ఖోయిరెంటాక్‌లో ప్రతీకార కాల్పుల్లో వ్యక్తి మృతి
ఈ వార్తాకథనం ఏంటి
మణిపూర్‌లో హింసాత్మకమైన ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా జరిగిన అల్లర్లలో మరో వ్యక్తి ప్రాణం గాల్లో కలిసిపోయింది. కుకీ-జో గ్రామంపై మూక దాడి చేయడంతో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు.
ఖోయిరెంటాక్‌లో తాజాగా హింస కాండ చోటు చేసుకుంది. సోమవారం కుకీ-జో గ్రామంపై మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో గ్రామ వాలంటీర్లు భీకర ప్రతీకార కాల్పులు జరిపారు.
ఘటనలో 30 ఏళ్ల జంగ్మిన్లున్ గాంగ్టే అక్కడికక్కడే మరణించాడు. మరోవైపు పలు సంస్థలకు చెందిన నలుగురు ఉగ్రవాదులను వేర్వేరు ఆపరేషన్లలో అరెస్ట్ చేశామని పోలీసులు వెల్లడించారు.
అనంతరం వారి నుంచి ఆయుధాలతో పాటు మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
details
రాష్ట్రంలో వరుసగా కొనసాగుతున్న హింసాత్మకమైన ఘటనలు
కాగా ఈ నలుగురు మిలిటెంట్లు ఎన్‌ఎస్‌సిఎన్ (ఐఎం), పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్‌ఏ), ఇంఫాల్ ఈస్ట్ పరిధిలోని చెందిన కాంగ్లీపాక్ కమ్యూనిస్ట్ పార్టీ (కేసీపీ), బిష్ణుపూర్ జిల్లాకు చెందిన (లామ్యాన్‌బా ఖుమాన్ వర్గం)కి చెందిన ఇద్దరు ఓవర్‌గ్రౌండ్ వర్కర్లుగా గుర్తించామని పోలీసులు పేర్కొన్నారు.
ఆగస్ట్ 27 ఆదివారం, రాజధాని ఇంఫాల్‌లోని న్యూ లంబులనే ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు మూడు పాడుబడ్డ ఇళ్లను తగులబెట్టారు.
సమాచారం అందుకున్నఅగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు.
మరో సందర్భంలో అదే రోజు అర్థరాత్రి 2 గంటలకు మాజీ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ కె.రాజో నివాసానికి కాపలాగా ఉన్న భద్రతా సిబ్బంది నుంచి గుర్తు తెలియని వ్యక్తులు ఆయుధాలను లాక్కోవడం గమనార్హం.