Page Loader
జైలులో ఉన్న ఆప్ నేత మనీష్ సిసోడియాపై సీబీఐ మరో కేసు
జైలులో ఉన్న ఆప్ నేత మనీష్ సిసోడియాపై సీబీఐ మరో కేసు

జైలులో ఉన్న ఆప్ నేత మనీష్ సిసోడియాపై సీబీఐ మరో కేసు

వ్రాసిన వారు Stalin
Mar 16, 2023
02:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీ ప్రభుత్వ ఫీడ్‌బ్యాక్ యూనిట్ (ఎఫ్‌బీయూ) కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు మనీష్ సిసోడియాపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) మరో కేసు నమోదు చేసింది. 2015లో దిల్లీలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆప్ ఎఫ్‌బీయూని ఏర్పాటు చేసింది. ఫీడ్‌బ్యాక్ యూనిట్‌ను చట్టవిరుద్ధంగా ఏర్పాటు చేయడం వల్ల ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ.36 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు సీబీఐ ఆరోపించింది.

సిసోడియా

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆగ్రహం

మనీష్ సిసోడియాపై మరో కేసు నమోదు చేయడంపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని దేశానికి విచారకరంగా అభివర్ణించారు. మనీష్‌పై అనేక తప్పుడు కేసులు బనాయించి, అతడిని ఎక్కువ కాలం కస్టడీలో ఉంచాలన్నది ప్రధానమంత్రి పథకం అని అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. ఈ మేరకు కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ఫీడ్‌బ్యాక్ యూనిట్ (ఎఫ్‌బీయు) కేసులో సిసోడియాను ప్రాసిక్యూట్ చేయడానికి ఫిబ్రవరిలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అవినీతి నిరోధక చట్టం కింద అనుమతిని ఇచ్చింది.