తీహార్ జైలులో మనీష్ సిసోడియాను ప్రశ్నించిన ఈడీ
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) గురువారం తీహార్ జైలులో దిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను రెండోసారి ప్రశ్నించింది. దిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పనలో అక్రమాలు, ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.100 కోట్లు లంచం ఇచ్చినం అంశాలపై ప్రధానంగా ఈడీ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. దిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణం వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారనే దానిపై ఈడీ ఆరా తీసినట్లు సమాచారం. సాక్ష్యాలను లేకుండా చేయడం కోసం ఫోన్లను మార్చడం, హోల్‌సేలర్‌ల లాభాల మార్జిన్‌ను 5% నుంచి 12%కి పెంచడం వంటి అంశాలు, ఇందులో సౌత్ గ్రూప్ పాత్ర ఏంటి అనే కోణంలో సిసోడియాను విచారిస్తున్నట్లు ఓ అధికారి చెప్పారు.
శుక్రవారం కూడా మనీష్ సిసోడియాను విచారించే అవకాశం
మనీష్ సిసోడియాను శుక్రవారం కూడా విచారించవచ్చని పేరు అధికారులు వెల్లడించారు. తాము ప్రస్తుతం పెద్ద కుట్ర, డబ్బు జాడపై దృష్టి పెడుతున్నామని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక అధికారి పేర్కొన్నారు. ఫిబ్రవరి 26న సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేయగా.. దిల్లీ కోర్టు సోమవారం మార్చి 20 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు కుమార్తె కవిత మార్చి 11న ఏజెన్సీ ఎదుట హాజరుకానున్నట్లు తెలిపారు. ఈ మేరకు గురువారమే దేశ రాజధానికి చేరుకున్నారు. తాను ఈడీ ఎదుట హాజరై వారికి సహరిస్తామని వెల్లడించారు.