
సికింద్రాబాద్ నుంచి పలు రైళ్ల రద్దు.. రద్దైన రైళ్ల పూర్తి వివరాలు ఇవే
ఈ వార్తాకథనం ఏంటి
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బయల్దేరే పలు రైళ్లు రద్దైనట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. గతవారం ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది.
జూన్ 7 నుంచి 13 వరకు ఆయా రూట్లలో ప్రయాణించే రైళ్లతో పాటు మరికొన్నింటిని సైతం నిలుపదల చేస్తున్నామని పేర్కొంది.
విద్యార్థులకే ఇబ్బందులు :
మరోవైపు సమ్మర్ సీజన్ ముగియటంతో తెలుగు రాష్ట్రాల్లోనే ప్రధాన రైల్వే స్టేషన్ సికింద్రాబాద్ నుంచి రాకపోకలు పెరుగుతున్నాయి. ఈ కీలక సమయంలో ముఖ్యమైన రైళ్లు రద్దు కావడంతో ప్రధానంగా విద్యార్థులతో కలిపి అన్ని వర్గాల ప్రయాణికులు ఇబ్బంది పడనున్నారు. ఫలితంగా ఇతర మార్గాల బాట పట్టే అవకాశం ఉంది.
Many Trains Cancelled Due To Odisha Train Accident Says Scr
పలు రైళ్ల పొడిగింపు, మరికొన్ని రద్దు, ఇంకొన్ని పాక్షికంగా క్యాన్సల్
1. కాచిగూడ - తిరుపతి (070 61 / 07062)
2. కాచిగూడ-కాకినాడ (07417 / 07418)
3. కాచిగూడ-నర్సాపూర్ (07653 / 07654) స్పెషల్ ట్రైన్స్ మాత్రం జూన్ 30 వరకు నడవనున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే సీపీఆర్వో వెల్లడించారు.
జూన్ 7 నుంచి 13 వరకు రద్దయ్యే రైళ్ల లిస్ట్ ఇదే
1. కాచిగూడ-నిజామాబాద్ (07596)
2. నిజామాబాద్-కాచిగూడ (07593)
3. నాందేడ్-నిజామాబాద్ (07854)
4. నిజామాబాద్-నాదేడ్ (07853) జూన్ 7న రద్దైన రైళ్లు :
1. కాచిగూడ-షాలిమార్-వాస్కోడిగామా (17603/18047)
2. షాలిమార్-హైదరాబాద్ (18045/18046) జూన్ 9న రద్దైన రైలు
1. వాస్కోడిగామా-షాలిమార్-కాచిగూడ (18048/17604) పాక్షికంగా రద్దు :
దౌండ్-నిజామాబాద్ (11409),
నిజామాబాద్-పంఢర్‌పూర్ (01413)