నేటి నుంచి మరాఠాలకు కుంబీ సర్టిఫికెట్లు.. సమయం కావాలన్న మహా సీఎం షిండే
మహారాష్ట్రలో మరాఠాల నిరసనలు హింసాత్మకంగా మారాయి. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చింది. ఈ మేరకు మరాఠా కోటా కార్యకర్త మనోజ్ జరాంగే నిరవధిక నిరాహార దీక్ష శిబిరం వద్ద మంగళవారం ప్రభుత్వ ప్రతినిధి ఆయనతో చర్చలు జరుపుతారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే తెలిపారు. మరోవైపు ఈ అంశాన్ని పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కొంత సమయం కావాలని సీఎం కోరారు. పాత రికార్డుల్లో 11,530 కుంబీ కుల ప్రస్తావన ఉందని, ఈ మేరకు మంగళవారం నుంచి తాజా సర్టిఫికెట్లు జారీ చేస్తామన్నారు. ఓబీసీ కోటా కోసం మరాఠా సమాజం హింసాత్మక నిరసనల మధ్య ఈ ప్రకటన జారీ అయ్యింది.
కుంబీకి విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ ప్రయోజనాలు అందుతున్నాయి.
వ్యవసాయంతో అనుబంధం ఉన్న కుంబిస్, మహారాష్ట్రలోని ఇతర వెనుకబడిన తరగతుల (OBC) వర్గం కింద వర్గీకరించబడ్డారు. ఈ క్రమంలోనే కుంబీకి విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ ప్రయోజనాలు అందుతున్నాయి. ఈ మేరకు మరాఠా కోటా సమస్యకు సంబంధించి సుప్రీంకోర్టులో ప్రతిపాదిత క్యూరేటివ్ క్యూరేటివ్ పిటిషన్‌ను సమర్పించనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి సలహా ఇచ్చేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన నిపుణుల కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. మరాఠా వర్గానికి కుంబీ కుల ధృవీకరణ పత్రాలు ఎలా ఇవ్వాలనే దానిపై నివేదిక సమర్పించేందుకు గతంలో గతంలో ఏర్పాటైన జస్టిస్ సందీప్ షిండే (రిటైర్డ్) కమిటీ మంగళవారం తన నివేదికను అందజేస్తుందన్నారు. దీనిపై మంత్రివర్గ సమావేశంలోనూ చర్చించనున్నట్లు పేర్కొన్నారు.