Page Loader
Union Budget 2025: స్టార్టప్‌లకు భారీగా రుణాల పెంపు.. ఆర్థిక మంత్రి కీలక ప్రకటన
స్టార్టప్‌లకు భారీగా రుణాల పెంపు.. ఆర్థిక మంత్రి కీలక ప్రకటన

Union Budget 2025: స్టార్టప్‌లకు భారీగా రుణాల పెంపు.. ఆర్థిక మంత్రి కీలక ప్రకటన

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 01, 2025
12:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సమ్మిళిత అభివృద్ధి పెట్టుబడుల సాధన లక్ష్యంగా బడ్జెట్‌ ఉంటుందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వృద్ధి మందగించినా, భారత్‌ మెరుగైన పనితీరు సాధించిందని ఆమె తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాలకు కొత్త హంగులు జోడిస్తామని, అన్ని ప్రభుత్వ స్కూల్స్‌కు బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు అందిస్తామని వెల్లడించారు. పదేళ్లలో ఐఐటీల్లో విద్యార్థుల సంఖ్య రెట్టింపు అవుతుందని, ఐఐటీ పాట్నా విస్తరణకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఐదేళ్లలో అదనంగా 75 వేల మెడికల్‌ సీట్లు, బీహార్‌లో నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫుడ్‌ టెక్నాలజీ స్థాపించనున్నట్లు చెప్పారు.

Details

రూ.30 వేలతో స్ట్రీట్‌ వెంటర్స్‌కు క్రెడిట్‌ కార్డులు

రూ.30 వేలతో స్ట్రీట్‌ వెంటర్స్‌కు క్రెడిట్‌ కార్డులు అందజేస్తామని, బొమ్మల తయారీకి ప్రత్యేక పథకం రూపొందించనున్నట్లు మంత్రి వెల్లడించారు. రాష్ట్రాలకు రూ.1.5 లక్షల కోట్లు రుణాలు అందజేసి, 50 ఏళ్లకు వడ్డీ రహిత రుణాలు మంజూరు చేస్తామని ప్రకటించారు. సంస్కరణలను అమలు చేసిన వారికి ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లు చెప్పారు. గిగ్‌ వర్కర్లకు గుర్తింపు కార్డులు ఇచ్చి, ఈ-శ్రమ్‌ పోర్టల్‌లో నమోదు చేస్తామని, పీఎం జన్‌ ఆరోగ్య యోజన కింద కోటి మంది గిగ్‌ వర్కర్లకు ఆరోగ్య బీమా ప్రయోజనాలు అందిస్తామని తెలిపారు. ఎగుమతుల్లో 45 శాతం వరకు ఎంఎస్‌ఎంఈల భాగస్వామ్యం ఉందని, వాటి కోసం ఐదేళ్లలో రూ.1.5 లక్షల కోట్లు అందజేస్తామన్నారు.

Details

పదేళ్లలో 4 కోట్ల మందికి విమాన ప్రయాణం కల్పించడమే లక్ష్యం

27 రంగాల్లో స్టార్టప్‌లకు రుణాల కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామని, సూక్ష్మ సంస్థలకు రూ.5 లక్షలతో క్రెడిట్‌ కార్డు మంజూరు చేస్తామని చెప్పారు. సూక్ష్మ సంస్థలకు తొలి ఏడాది 10 లక్షల వరకు క్రెడిట్‌ కార్డులు అందజేస్తామని, ఎంఎస్‌ఎంఈలకు రూ.10 వేల కోట్లతో ఫండ్‌ ఆఫ్‌ ఫండ్‌ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. రూ.30 వేల పరిమితితో పట్టణ పేదల కోసం యూపీఐ లింక్డ్‌ క్రెడిట్‌ కార్డులు అందిస్తామన్నారు. కొత్త ఉడాన్‌ పథకాన్ని మరో 120 రూట్లలో అమలు చేస్తామన్నారు. 10 సంవత్సరాలలో 4 కోట్ల మందికి విమాన ప్రయాణం కల్పించడమే లక్ష్యమని స్పష్టం చేశారు.