
Mayawati: ఎన్నికల తర్వాతే పొత్తులు గురించి ఆలోచిస్తాం.. ఇప్పుడు ఒంటరిగానే: మాయావతి
ఈ వార్తాకథనం ఏంటి
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ ఎవరితోనూ పొత్తు పెట్టుకోబోదని బీఎస్పీ అధినేత్రి మాయావతి మరోసారి స్పష్టం చేశారు.
ఈ ఎన్నికల్లో బీఎస్పీ ఒంటరిగా పోటీ చేస్తుందన్నారు. పొత్తుపై వస్తున్న ఊహాగానాలపై మాయావతి అసహనం వ్యక్తం చేశారు. వాటిని పుకార్లు అని కొట్టిపారేశారు.
ఈ మేరకు మాయావతి తన 'X' ఖాతాలో ట్వీట్ చేసారు. ప్రతిరోజూ బీఎస్పీ పొత్తు గురించి పుకార్లు వ్యాప్తి చేయడం కొన్ని పార్టీలకు పరిపాటిగా మారిందన్నారు.
పొత్తు వదంతుల పట్ల బీఎస్పీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలన్నారు. తమ పార్టీ సొంతంగా ఎన్నికల్లో పోటీ చేస్తుందని మాయావతి చెప్పారు.
బీఎస్పీ
సబ్బండ వర్గాల మద్దతుతో బీఎస్పీ పోరాడుతుంది: మాయావతి
సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ పేద, బడుగు బలహీన వర్గాలు, ముఖ్యంగా దళితులు, గిరిజనులు, అగ్రవర్ణాలు, ముస్లింలు, ఇతర మతపరమైన మైనారిటీ వర్గాల మద్దతుతో పోరాడుతుందని మాయావతి పేర్కొన్నారు.
దేశంలోని కులతత్వ, పెట్టుబడిదారీ, సంకుచిత, మతతత్వ భావాలు కలిగిన అన్ని ప్రతిపక్ష పార్టీలకు తాము దూరంగా ఉంటానని ప్రకటించారు.
ఇప్పుడు ఏ పార్టీతో పొత్తు ఉండదని, అయితే ఎన్నికల తర్వాత తమ పార్టీ పొత్తు గురించి ఆలోచిస్తుందని స్పష్టం చేశారు.
విపక్షాల కూటమి 'ఇండియా' తలుపులు బీఎస్‌పీకి తెరిచి ఉన్నాయని ఇటీవల కాంగ్రెస్ యూపీ ఇన్‌ఛార్జ్ అవినాష్ పాండే వ్యాఖ్యానించిన నేపథ్యంలో మాయావతి ఈ ప్రకటన విడుదల చేయడం అనేది ఆసక్తికరంగా మారింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మాయావతి ట్వీట్
1. आगामी लोकसभा आमचुनाव बीएसपी द्वारा किसी भी पार्टी से गठबंधन नहीं करने की बार-बार स्पष्ट घोषणा के बावजूद आएदिन गठबंधन सम्बंधी अफवाह फैलाना यह साबित करता है कि बीएसपी के बिना कुछ पार्टियों की यहाँ सही से दाल गलने वाली नहीं है, जबकि बीएसपी को अपने लोगों का हित सर्वोपरि है।
— Mayawati (@Mayawati) February 19, 2024