తదుపరి వార్తా కథనం

Iran: ఇరాన్ వెళ్లే భారతీయుల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం
వ్రాసిన వారు
Sirish Praharaju
Aug 29, 2025
12:46 pm
ఈ వార్తాకథనం ఏంటి
విదేశాంగశాఖ ఇరాన్‌కు వెళ్తున్న భారతీయుల కోసం ఇచ్చిన మినహాయింపును రద్దు చేసింది. దీంతో, ఆ దేశానికి వెళ్లే ప్రతి భారతీయుడికీ ఎమిగ్రేషన్ క్లియరెన్స్ తప్పనిసరి అయ్యింది. విదేశాంగ శాఖ 2025 ఆగస్టు 26న ఇచ్చిన ప్రకటనలో, "1983లో రూపొందించిన ఎమిగ్రేషన్ చట్టం (Section 41, Sub-section 1) కింద ఉన్న అధికారాలను ఉపయోగిస్తూ, ఇరాన్‌కు వెళ్తున్న భారతీయుల హక్కులు, భద్రతను రక్షించడానికి కేంద్ర ప్రభుత్వం, 2006 డిసెంబరు 28న జారీ చేసిన S.O. 2161(E) నోటిఫికేషన్ ద్వారా ఇచ్చిన మినహాయింపును రద్దు చేస్తుంది" అని పేర్కొంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఇరాన్ వెళ్లే భారతీయుల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం
MEA makes emigration clearance mandatory for Indians going to Iranhttps://t.co/sUh6tw9yzG
— Economic Times (@EconomicTimes) August 29, 2025