
Ministry of Foreign Affairs: 36 ప్రాంతాలలో 400 డ్రోన్లతో పాకిస్థాన్ దాడులు: విదేశాంగ మంత్రిత్వ శాఖ
ఈ వార్తాకథనం ఏంటి
భారత సరిహద్దులను లక్ష్యంగా చేసుకొని గురువారం రాత్రి పాకిస్థాన్ విస్తృత స్థాయిలో డ్రోన్ దాడులకు పాల్పడినట్లు సమాచారం.
జమ్ముకశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలలోని మొత్తం 36 ప్రాంతాలపై ఈ దాడులు జరిగాయని భారత సైనిక అధికారులు వెల్లడించారు.
దాదాపు 300 నుంచి 400 డ్రోన్లను వినియోగించి పాకిస్తాన్ ఈ దాడులకు పాల్పడిందని తెలిపారు.
పాకిస్థాన్ తన పౌర విమానాలను రక్షణ కవచాలుగా ఉపయోగిస్తోందని వెల్లడించింది.
వివరాలు
టర్కీ డ్రోన్‌తో పాకిస్తాన్ దాడి
ఈ దాడులపై విలేకరుల సమావేశంలో విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, కర్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్‌లు కీలక వివరాలు వెల్లడించారు.
భారత గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిస్పందన సామర్థ్యాన్ని పరీక్షించటం, అలాగే నిఘా సమాచారాన్ని సేకరించటమే ఈ దాడుల ప్రధాన ఉద్దేశ్యంగా ఉందని వారు స్పష్టం చేశారు.
ప్రాథమిక విశ్లేషణ ప్రకారం, ఈ దాడుల్లో తుర్కియేకు చెందిన 'ఆసిస్‌గార్డ్ సోంగర్' మోడల్ డ్రోన్లు ఉపయోగించబడినట్టు తెలిసిందని పేర్కొన్నారు.
వివరాలు
అనేక డ్రోన్లను విజయవంతముగా కూల్చేసిన భారత భద్రతా బలగాలు
గురువారం రాత్రి పాకిస్థాన్ రెచ్చిపోయింది. నియంత్రణ రేఖ వెంబడి ఉల్లంఘనలు చేస్తూ భారత్‌పై దాడులకు తెగబడింది.
భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేపట్టింది. పాక్ వైపు నుంచి సుమారు 300 నుంచి 400 డ్రోన్లు భారత సరిహద్దుల్లోకి ప్రవేశించాయి.
వీటిలో అనేక డ్రోన్లను భారత భద్రతా బలగాలు విజయవంతంగా కూల్చేశాయి.
పంజాబ్ సరిహద్దుల్లో భద్రతా బలగాలు అత్యంత అప్రమత్తంగా ఉన్నాయి. ఈ దాడుల్లో పలువురు గాయపడ్డారు.
పాకిస్థాన్ దాడులను భారత వాయుసేన సమర్థంగా ఎదుర్కొంది. ప్రత్యేకంగా ప్రార్థనా మందిరాలపైనే పాకిస్థాన్ దాడులు చేస్తుండటం గమనార్హం.
ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించేందుకు పాక్ ప్రయత్నిస్తోంది.
వివరాలు
పౌర విమానాలను పాకిస్థాన్ రక్షణ కవచంగా వాడుకుంటోంది
ఇకపోతే, డ్రోన్, క్షిపణి దాడులు ప్రారంభించినా కూడా, పాకిస్థాన్ గగనతలాన్ని పౌర విమానాలకు మూసివేయలేదు.
కరాచీ, లాహోర్ మధ్య విమాన సర్వీసులు సాధారణంగానే నడుస్తున్నాయి. భారత ప్రతిస్పందన తప్పనిసరి అని తెలిసినా, పౌర విమానాలను రక్షణ కవచంగా ఉపయోగించేందుకు పాకిస్థాన్ ప్రయత్నిస్తోంది.
భారత్-పాక్ మధ్య అంతర్జాతీయ సరిహద్దు ప్రాంతంలో ప్రయాణించే విమానాలకు ఇది ప్రమాదకరమే.
అంతర్జాతీయ విమానాల భద్రతను దృష్టిలో పెట్టుకుని, భారత వాయుసేన అత్యంత శాంతంగా, బాధ్యతతో వ్యవహరిస్తోందని రక్షణశాఖ ప్రతినిధులు కర్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్‌లు తెలిపారు.