Page Loader
Medigadda visit: 29న ఉత్తమ్‌, శ్రీధర్‌బాబు మేడిగడ్డ పర్యటన 
Medigadda visit: 29న ఉత్తమ్‌, శ్రీధర్‌బాబు మేడిగడ్డ పర్యటన

Medigadda visit: 29న ఉత్తమ్‌, శ్రీధర్‌బాబు మేడిగడ్డ పర్యటన 

వ్రాసిన వారు Stalin
Dec 25, 2023
01:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణాల్లో అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్ సర్కార్ అసెంబ్లీ వేదికగా ఆరోపించింది. అలాగే ఆరోపణలతో ఆగిపోని.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది. ఈమేరకు సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు మేడి గడ్డ (Medigadda) ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 29న మేడిగడ్డను మంత్రులు సందర్శిస్తారు. ప్రాజెక్టు వాస్తవ పరిస్థితులు తెలుసుకోనున్నారు. అంతేకాకుండా, మెడిగడ్డ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టుపై మంత్రులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ పవర్ పాయింట్ ద్వారా ప్రాణహిత, కాళేశ్వరం ప్రాజెక్టుల నిర్మాణంతో జరిగిన లాభ, నష్టాలు మంత్రులు వివరించనున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

 కాళేశ్వరం ప్రాజెక్టుపై మంత్రుల పవర్ పాయింట్  ప్రజెంటేషన్‌